Share News

కేసులు కొట్టివేతపై హర్షం

ABN , Publish Date - Apr 03 , 2026 | 12:20 AM

వంశధార నిర్వాసితులపై పెట్టిన కేసులను కొత్తూరు కోర్టు కొట్టివేయడంపై నిర్వాసితులు, సీపీఎం నాయ కులు హర్షం వ్యక్తం చేశారు.

కేసులు కొట్టివేతపై హర్షం

మెళియాపుట్టి (కొత్తూరు), ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): వంశధార నిర్వాసితులపై పెట్టిన కేసులను కొత్తూరు కోర్టు కొట్టివేయడంపై నిర్వాసితులు, సీపీఎం నాయ కులు హర్షం వ్యక్తం చేశారు. చెప్పినట్టు ఎస్‌ఐ వెంకటేశ్వరరావు గురువారం తెలి పారు. భామిని మండలంలో సింగిడి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణలో భాగం గా నిర్వాసితులకు న్యాయం చేయాలని 2016లో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన తె లిపారు. ఈ నిరసన కార్యక్రమంపై అప్పట్లో తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశారు. దీనిపై వాదనలు విన్న న్యాయాధికారి రాణి కేసులను కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. కేసుల నుంచి విముక్తి లభించడంతో సీపీఎం నాయకులు సిర్ల ప్రసాద రావు, గంగరావు, సింహాచలం, ప్రసాదరావు, నిర్వాసితులు ఆనందం వ్యక్తం చేశారు.

Updated Date - Apr 03 , 2026 | 12:20 AM