Share News

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయం

ABN , Publish Date - Jul 05 , 2026 | 11:51 PM

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ఏపీ యూడబ్ల్యూజే పనిచేస్తుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు అన్నారు.

 జర్నలిస్టుల సంక్షేమమే  ధ్యేయం
మాట్లాడుతున్న ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు

ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు

శ్రీకాకుళం అర్బన్‌, జూలై 5(ఆంధ్రజ్యోతి): జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ఏపీ యూడబ్ల్యూజే పనిచేస్తుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు అన్నారు. రాజకీయాలు తమకు అనవసరమ న్నారు. స్థానిక రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ సమా వేశ మందిరంలో ఆదివారం ఏపీయూడబ్ల్యూజే జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిటైర్డ్‌ జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. సంబంధిత శాఖల మంత్రులకు సమస్యలు వివరించామని, వారు కొన్ని హామీలు ఇచ్చారన్నారు. వారిపై నమ్మకం ఉందని, ఆగస్టు 17 వరకూ వేచి చూసి తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. యూని యన్‌ జిల్లా అధ్య క్షుడు సీహెచ్‌ జగదీష్‌ అధ్య క్షతన జరిగిన సమావేశంలో చిన్న, మధ్య తరహా వార్తాపత్రికల సంఘం (సామ్నా) అధ్యక్షుడు నల్లి ధర్మారావు, సీనియర్‌ నాయకుడు సనపల నర సింహులు, ఐజేయూ కౌన్సిల్‌ సభ్యుడు డి.మహ రాణ, యూని యన్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బెండి నర్సింగ రావు, జిల్లా కార్యదర్శి సనపల రమేష్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియా జర్నలిస్టుల అసోసి యేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పైడి బాల కృష్ణ, ఎం.వాసు, సామ్నా జిల్లా అధ్యక్షుడు సున్నపు చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2026 | 11:51 PM