Share News

బీసీల్లో జోష్‌

ABN , Publish Date - Oct 11 , 2026 | 12:36 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సముచిత ప్రాతి నిధ్యం కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

బీసీల్లో జోష్‌

  • స్థానిక సంస్థల ఎన్నికల్లో సగటున 28.18 శాతం రిజర్వేషన్లు

  • తగ్గిన చోట పార్టీల తరపున 34 శాతానికి పైగా టికెట్లు

  • రాజీవ్‌ రంజన్‌ మిశ్రా కమిషన్‌ నివేదికకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌

  • సిక్కోలు బీసీ వర్గాల్లో ఆనందోత్సాహాలు.. ప్రభుత్వంపై ప్రశంసలు

శ్రీకాకుళం, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సముచిత ప్రాతి నిధ్యం కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజీవ్‌ రంజన్‌ మిశ్రా నేతృత్వంలోని ప్రత్యేక కమిషన్‌ నివేదిక ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో సగటున 28.18 శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభు త్వం జీవో 17 జారీ చేసింది. చ ట్టపరమైన పరిమితుల కారణంగా ఎక్కడైనా రిజ ర్వేషన్లు తగ్గితే.. పార్టీ తర పున 34 శాతానికి పైగా టికెట్లు కేటాయిస్తామని కూటమి నేతలు ప్రకటించారు. దీంతో శ్రీకాకుళం జిల్లాలోని బీసీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. రానున్న స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల్లోనూ ఉత్సాహం నెలకొంది.

జిల్లాలో పెరగనున్న ప్రాతినిధ్యం

జిల్లాలో బీసీ సామాజికవర్గం గణనీయంగా ఉంది. తాజా నిర్ణయంతో గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీల్లో బీసీలకు ప్రాతినిధ్యం లభించనుంది. గతంలో రిజర్వేషన్లు థివ శాతం నుంచి థవ శాతానికి తగ్గడంతో బీసీలకు రాజకీయంగా నష్టం జరిగిందన్న అభిప్రాయం ఆ వర్గాల్లో ఉంది. సుప్రీంకోర్టు నిర్దేశించిన ట్రిపుల్‌ టెస్ట్‌ నిబంధనలకు అనుగుణంగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి మొత్తం 50 శాతానికి మించకుండా కోటాలను ఖరారు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

బీసీ సంఘాల్లో హర్షం

బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో గతంలో ఎన్టీఆర్‌, చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలను గుర్తుచేస్తూ.. తాజా నిర్ణయంపైనా బీసీ మేధావులు, సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయపరమైన నిబంధనలకు అనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేయడం వల్ల స్థానిక సంస్థల్లో బీసీల ప్రాతినిధ్యానికి మార్గం సుగమమవు తుందని అభిప్రాయపడుతున్నారు.

ఆశావహుల్లో కొత్త ఉత్సాహం

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న బీసీ యువ నాయకుల్లో తాజా నిర్ణయం కొత్త ఆశలు రేకెత్తించింది. రిజర్వేషన్లు తగ్గిన చోట పార్టీ తరఫున 34 శాతానికి పైగా టికెట్లు కేటాయిస్తామని మంత్రులు అచ్చెన్నా యుడు, డోలా బాలవీరాంజనేయ స్వామి తదితరులు ప్రకటించడంతో ఆశావహులు గ్రామాల్లో రాజకీయ సమీకరణాలపై దృష్టి సారిస్తున్నారు. సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో పోటీకి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

గతంలో స్థానిక పదవులు చేపట్టిన సీనియర్‌ బీసీ నాయకులు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన, న్యాయస్థానాల మార్గదర్శ కాలకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయడం బీసీల రాజకీయ సాధికారతకు దోహదపడుతుందని వారు అభిప్రా యపడుతున్నారు.

Updated Date - Oct 11 , 2026 | 12:36 AM