Share News

టీడీపీలో చేరికలు

ABN , Publish Date - Oct 19 , 2026 | 12:08 AM

శ్రీకాకుళం నగరంతో పాటు రూరల్‌ మండలం ఇప్పిలి గ్రామంలో వైసీపీ కి భారీ షాక్‌ తగిలింది.

టీడీపీలో చేరికలు
ఇప్పిలి గ్రామం నుంచి టీడీపీలో చేరిన వారితో ఎమ్మెల్యే గొండు శంకర్‌

  • కండువాలు వేసి ఆహ్వానించిన ఎమ్మెల్యేలు

  • ఇప్పిలిలో వైసీపీకి భారీ షాక్‌

శ్రీకాకుళం/ శ్రీకాకుళం అర్బన్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరంతో పాటు రూరల్‌ మండలం ఇప్పిలి గ్రామంలో వైసీపీ కి భారీ షాక్‌ తగిలింది. సుమారు 540 కుటుంబాలు ఆది వారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. వీరికి ఎమ్మెల్యే గొండు శంకర్‌ పార్టీ కండువాలు వేసి ఆహ్వానిం చారు. ఇప్పిలి గ్రామం నుంచి వైసీపీ నాయకులు లోలుగు శ్రీనివాసరావు, లోలుగు శివరామకృష్ణ, ఇప్పిలి సత్యనారాయణ తో పాటు మరో 500 మంది కుటుంబా లు, నగరంలోని 14వ డివిజన్‌ పరిధి (జడ్పీ ఎదురు ఏపీహెచ్‌బీ కాలనీ)లో వైసీపీ నాయకుడు గవిడి వాసు దేవరావుతో 40 కుటుంబాల వారు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం పురోభి వృద్ధి సాధిస్తోందన్నారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ పనితీరును విశ్వసించి పార్టీలో చేరడం శుభపరిణామ మన్నారు. నియోజకవర్గ అభి వృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఏపీహెచ్‌బీ కాలనీలో కార్గిల్‌ పార్కు ను అభివృద్ధి చేశామని, కాలువల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామ ని హామీ ఇచ్చారు. కార్యక్రమం లో 14వ డివి జన్‌ (ఏపీ హెచ్‌బీ కాలనీ) పార్టీ ఇన్‌చార్జి పి.మధుసూ దనరావు, నేతలు శ్రీకాంత్‌ వర్మ, కొర్ను ప్రతాప్‌, నక్క శంకర రావు, విబూది సూరి బాబు, పెద్ది కవిత, కటారి కమల, రూరల్‌ మండల నేతలు పాల్గొన్నారు.

వైసీపీని వీడి టీడీపీలోకి 100 కుటుంబాలు

ఆమదాలవలస, అక్టోబరు 18 (ఆంధ్ర జ్యోతి): మండలంలోని సేపేనపేట, కొరపాం గ్రామాల నుంచి సుమారు 100 కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే కూన రవికుమార్‌ పార్టీ కండు వాలు వేసి ఆహ్వానించారు. ఆదివారం స్థాని క పార్టీ కార్యాల యంలో జరిగిన కార్యక్ర మంలో టీడీపీలో చేరిన వారిలో గుడికి రాజు, కలిగేటి మల్లేశ్వరరావు, సాలాపు రాజారావు, లావేటి సూర్యనారాయణ, దంగ ల రాము, మన్నేన సూర్యనారాయణ, గుడి రాజు, గారడ రంగ, సేపేన గోవిందరావు, శంకరరావు, తవిటి నాయుడు ఆధ్వర్యంలో రెండు గ్రామాలకు చెందిన వారు ఉన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజ యానికి కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో నారాయణపురం ఆనకట్ట చైర్మన్‌ సనపల ఢిల్లీశ్వరరావు, రాష్ట్ర కళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ తమ్మినేని చంద్రశేఖర్‌, టీడీపీ నాయకులు వండాన ఉదయ్‌ కుమార్‌, అన్నెపు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

కీర్తిపురం నుంచి 70 కుటుంబాలు

ఇచ్ఛాపురం, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): కొళిగాం మండల ప్రాదేశికంలో 70 కుటుంబాలు ఆదివారం టీడీపీలో చేరాయి. కీర్తిపురం పంచాయతీ మాజీ సర్పంచ్‌ రాపాక చంద్రయ్య యాదవ్‌తో పాటు 70 కుటుంబాల వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారి కి టీడీపీ మండల అధ్యక్షుడు లోపింటి పద్మనాభం, పీఏసీఎస్‌ అధ్యక్షుడు పెదిని బాబ్జీ, నేతలు మేరుగు సూర్యనారాయణ, సహదేవ్‌ రెడ్డి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ధర్మరాజురెడ్డి, డిరామారావు, చంద్రశేఖర్‌, దుర్యోధన, డి.కామేష్‌, డి.ఢిల్లీరావు, బి.లోహిదాస్‌ తదితరులు పాల్గొన్నారు.

సర్వేశ్వరపురం నుంచి 50 కుటుంబాలు

జి.సిగడాం, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): సర్వేశ్వరపురం గ్రా మానికి చెందిన సుమారు 50 వైసీపీ కుటుంబాలు టీడీపీలోకి చేరాయి. వీరికి టీడీపీ మండల అద్యక్షుడు కుమరాపు రవి కుమార్‌ ఆదివారం పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో డీఆర్‌వలస ఎంపీటీసీ పరిధి వైసీపీ నేత లు గుణుపూరు సూర్యనారాయణ, గుడివాడ నాగేష్‌, గుణుపూరు పాపయ్య, వి.రామయ్య, వి.గౌరినాయుడు, వి.సురేష్‌, జి.అప్పయ్య, జి.వెంకటరమణ, కె.లక్ష్మణ, ఈ.అప్పలస్వామి, ఈ.ఆది నారాయణ, తదితరులున్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు కుమరాపు అప్పలనాయుడు, గోపాలకృష్ణరాజు, సుంకరి అప్పన్న, గుణుపూరు గోవింద, నక్క ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 19 , 2026 | 12:08 AM