Share News

చేయి చేయి కలిపి.. మట్టి తొలగించి

ABN , Publish Date - Aug 16 , 2026 | 11:57 PM

మండలంలోని కొత్తపోలవలస, నర్సింగరాయుడుపేట, పాలకొండపేట తదితర గ్రామాలకు చెందిన రైతులు వంశధార కాలువల్లో చేయి చేయి కలిపి తుప్పలు, మట్టి తొలగిస్తున్నారు.

చేయి చేయి కలిపి.. మట్టి తొలగించి
కాలువలో గుర్రపుడెక్క తొలగిస్తున్న నర్సింగరాయుడుపేట రైతులు :

నరసన్నపేట, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొత్తపోలవలస, నర్సింగరాయుడుపేట, పాలకొండపేట తదితర గ్రామాలకు చెందిన రైతులు వంశధార కాలువల్లో చేయి చేయి కలిపి తుప్పలు, మట్టి తొలగిస్తున్నారు. కొం దరు రైతులు ముందు కొచ్చి ఆయకట్టుకు సాగునీరు వెళ్లేలా కాలువల్లో పేరుకుపోయిన డొంకలు, గుర్రపు డెక్క శ్రమదానం చేసి తొలగిస్తున్నారు. కామేశ్వరిపేట, లుకలాం, ముషిడిగట్టు, కొత్త పోలవలస, నర్సింగరాయుడుపేట, మడపాం, చేనులవలస, పోతయ్యవలస, గోపాల పెంట పంచాయతీల పరిధిలో వంశధార నదితీర గ్రామాల్లో 3,122 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఏటా ఆగస్టునాటికి కాలువల ద్వారా సాగునీరందించడంతో ఉబాలు పూర్తి చేసేవారు. కానీ ఈఏడాది ఆగస్టు పూర్తవుతున్నా.. సాగునీరు అందకపోవడంతో నదితీర గ్రామ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎదలను బతికించేందుకు నీరు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలుచేస్తున్నారు. కాలువల్లో గుర్రపుడెక్క వల్ల నీరు పిల్లకాలువలకు రావడంలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈనేపథ్యంలోఇక్కడ పలు గ్రా మాల్లో ఆయకట్టుకు నీరందక రైతులు ఇబ్బందిపడుతున్నారు. ఈ తరుణంలో కొన్ని ప్రాంతాల్లో యంత్రాలతో రైతులే స్వయంగా కాలువలను శుభ్రం చేసుకుంటున్నారు.

Updated Date - Aug 16 , 2026 | 11:57 PM