చేయిచేయి కలిపి.. సాగునీటి కాలువలను శుభ్రం చేసి
ABN , Publish Date - Oct 04 , 2026 | 11:54 PM
వారంతా రైతులు.. సాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు.. కాలువల్లో పిచ్చి మొక్కలు, గుర్రపుడెక్క పెరిగిపోయి నీరు సక్ర మంగా ప్రవహించక పోవడంతో వారంతా ఏక మయ్యారు.. అందరూ కలిసి ఐక్యంగా శ్రమ దానం చేసి కాలువలను బాగు చేసుకున్నారు.
బాహుదా, నారాయణపురం పరిధిలోని రైతుల శ్రమదానం
ఇచ్ఛాపురం/ఎచ్చెర్ల, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): వారంతా రైతులు.. సాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు.. కాలువల్లో పిచ్చి మొక్కలు, గుర్రపుడెక్క పెరిగిపోయి నీరు సక్ర మంగా ప్రవహించక పోవడంతో వారంతా ఏక మయ్యారు.. అందరూ కలిసి ఐక్యంగా శ్రమ దానం చేసి కాలువలను బాగు చేసుకున్నారు. ఇచ్ఛాపురం పట్టణంలోని బాహుదా నదీ ప్రధాన కాలువ, ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేట వద్ద నారాయణపురం కుడి కాలువ పరిధి ఆయ కట్టు రైతులు ఆదివారం పిచ్చిమొక్కలు, గుర్రపు డెక్క ను తొలగించారు. ‘ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని.. ఎదురు చూడకుండా సాగునీటి ప్రవాహానికి అడ్డంకు లను వారే శ్రమ దానం చేసి తొలగించడంతో ఆయా గ్రామాల ప్రజలు, రైతులు హర్షం వ్యక్తంచేశారు. ఖరీఫ్ గట్టెక్కేందుకు ఉన్న నీటిని వినియోగించుకునేలా శ్రమదానం చేసినట్లు రైతులు పేర్కొన్నారు. ఇప్పటికైనా సం బంధిత అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో కాలువ లను అభివృద్ధి చేయాలని రైతులు కోరుతున్నారు.