క్రీడా కోటాతో ఉద్యోగాలు
ABN , Publish Date - Jun 07 , 2026 | 11:35 PM
క్రీడా కోటా వల్ల ఉద్యోగాలు వచ్చే అవ కాశం ఉంటుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. స్థానిక ఏడు రోడ్ల జంక్షన్‌లో సమ్మర్ తైక్వాండో లీగ్ 2006 సబ్ జూనియర్స్, క్యాడిట్, జూనియర్, సీనియర్ విభాగాలకు సంబంధించి జిల్లాస్థాయి పోటీల ముగింపు కార్యక్రమంలో విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
శ్రీకాకుళం స్పోర్ట్స్, జూన్ 7(ఆంధ్రజ్యోతి): క్రీడా కోటా వల్ల ఉద్యోగాలు వచ్చే అవ కాశం ఉంటుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. స్థానిక ఏడు రోడ్ల జంక్షన్‌లో సమ్మర్ తైక్వాండో లీగ్ 2006 సబ్ జూనియర్స్, క్యాడిట్, జూనియర్, సీనియర్ విభాగాలకు సంబంధించి జిల్లాస్థాయి పోటీల ముగింపు కార్యక్రమంలో విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కాగా జిల్లా నలుమూలల నుంచి వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీలకు క్రీడాకారులు ప్రతిభను కనబరిచారు. ఈ పోటీలు ఆదివారం రాత్రి వరకు సాగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడాకారులకు ప్రోత్సహిస్తూ క్రీడా కోటాను పెంచిందని, తద్వారా ఎందరో క్రీడా కారులకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. కార్యక్రమాల్లో రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం, టీడీపీ నాయకులు పాండ్రంకి శంకర్, వైసీపీ నాయకులు శిమ్మ రాజశేఖర్, మండవల్లి రవి, ఉన్న నాగరాజు, దళిత జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కంఠ వేణు, వివిధ సంఘ నాయకులు చౌదరి పురషో త్తమనా యుడు, మెట్ట నాగరాజు, నౌపడ విజయ్‌కుమార్, సుధీర్ వర్మ పాల్గొన్నారు.