Share News

విద్యుత్‌శాఖలో కొలువులు

ABN , Publish Date - Jul 09 , 2026 | 12:28 AM

: నిరుద్యోగ యువతకు శుభవార్త. ఉద్యోగాలకు గత నెలలో నోటిఫికేషన్‌ జారీ అయింది.

విద్యుత్‌శాఖలో కొలువులు

- 136 ఏఈఈ పోస్టుల భర్తీకి చర్యలు

-దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

ఇచ్ఛాపురం, జూలై 8(ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ యువతకు శుభవార్త. ఉద్యోగాలకు గత నెలలో నోటిఫికేషన్‌ జారీ అయింది. ఏపీఈపీడీసీఎల్‌ పరిధిలోని 11 జిల్లాల్లో 136 ఏఈ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ సైతం ప్రారంభమైంది. ఈ నెల 20 వరకూ దరఖాస్తుకు గడువు ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల పరిధిలో నియామకాలు జరగనున్నాయి.

- యూజీసీ అనుమతించిన విశ్వవిద్యాలయాల్లో ఎలకా్ట్రనిక్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. టెలికాం ఏఈఈ పోస్టులకు గాను టెలీ కమ్యూనికేషన్‌ విభాగంలో ఇంజనీరింగ్‌ చేసి ఉండాలి. సివిల్‌ ఏఈఈ పోస్టులకు సివిల్‌ ఇంజనీరింగ్‌ చేసిన వారు అర్హులు. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 47 సంవత్సరాల వరకూ మినహాయింపు ఉంది. దివ్యాంగులకు 52 సంవత్సరాల వరకూ అవకాశం ఉంది.

- ఓసీ కేటగిరీలో 55, బీసీ 38, ఎస్సీ 20, ఎస్టీ 9, ఈడబ్ల్యూఎస్‌లకు 13 పోస్టులు కేటాయించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 22 నుంచి 29 వరకూ కంప్యూటర్‌ ఆన్‌లైన్‌ బేస్డ్‌ టెస్టు నిర్వహిస్తారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా 48 పరీక్ష కేంద్రాలను ఇప్పటికే గుర్తించారు. ఇతర రాష్ట్రాల్లో మరో 7 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. కోర్‌ సబ్జెక్టుల నుంచి 70 మార్కులు, జనరల్‌ ఇంటెలిజెన్స్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌, అప్టిట్యూడ్‌, కంప్యూటర్‌ పరిజ్ఞానం కలిపి మరో 30 మార్కులకు ఉంటాయి. భారీగా పోస్టులు ఉండడంతో నిరుద్యోగులకు ఇదో మంచి అవకాశం.

Updated Date - Jul 09 , 2026 | 12:29 AM