Share News

జూన్‌ 2న జాబ్‌మేళా

ABN , Publish Date - May 30 , 2026 | 11:32 PM

నగరంలోని ప్రభుత్వ డీఎల్‌ టీసీలో జూన్‌ 2వ తేదీన జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధి కారి కె.సుధ ఒక ప్రకటనలో తెలిపారు.

 జూన్‌ 2న జాబ్‌మేళా

శ్రీకాకుళం కలెక్టరేట్‌, మే 30(ఆంధ్రజ్యోతి): నగరంలోని ప్రభుత్వ డీఎల్‌ టీసీలో జూన్‌ 2వ తేదీన జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధి కారి కె.సుధ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు డీఎల్‌టీసీ(బలగ, ఐటిఐ), హాస్పిటల్‌ జంక్షన్‌ వద్ద ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో కేవీఆర్‌ ఇంజినీర్స్‌, కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌, ముత్తూట్‌ మైక్రోఫిన్‌ లిమిటెడ్‌, 2050-హెల్త్‌కేర్‌ సంస్థలు ఇంటర్వూలు నిర్వ హిస్తా యన్నారు. ఇంజినీరింగ్‌ కంపెనీలో 100 ఉద్యోగాలకు ఐటీఐ(మెకానికల్‌, ఫిట్టర్‌) అర్హత కలిగి 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయసు గలవారు అర్హు లన్నారు. మహారాష్ట్రలోని చద్రపూర్‌లో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ముత్తూట్‌ కంపెనీలో 40 మంది రిలేషన్‌ ఆఫీసర్ల పోస్టులకు ఇంటర్‌ ఆపైన విద్యార్హత కలిగి 18-28 మధ్య వయసు గలవారు అర్హులని, వీరు శ్రీకాకుళం, పలాస, సోంపేట, పెందుర్తిలలో పనిచేయాల్సి ఉంటుంన్నారు. అలాగే 2050-హెల్త్‌కేర్‌లో బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్హత కలిగి, 18-35 మధ్య వయసు గలవారు అర్హులని, శ్రీకాకుళం, పలాస, సోంపేట, టెక్కలి, ఇచ్ఛాపురంలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి, అర్హత గలవారు తమ వివరాలను డబ్లుడబ్లుడబ్లు.ఎన్‌సీఎస్‌.జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో నమో దు చేసుకోవాలని, జాబ్‌మేళాకు బయో డేటా, విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్‌ కార్డులతో హాజరు కావాలని కోరారు.

Updated Date - May 30 , 2026 | 11:32 PM