Share News

ఎన్నికల హామీ మేరకే జాబ్‌ క్యాలెండర్‌

ABN , Publish Date - Mar 21 , 2026 | 11:59 PM

కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయం పనిచేయడమే కాకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేసిందని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్‌ బెందాళం అశోక్‌ తెలిపారు.

 ఎన్నికల హామీ మేరకే జాబ్‌ క్యాలెండర్‌
ఇచ్ఛాపురం: జెండా ఊపి ఆర్టీసీ బస్సును ప్రారంభిస్తున్న అశోక్‌ :

కవిటి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయం పనిచేయడమే కాకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేసిందని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్‌ బెందాళం అశోక్‌ తెలిపారు. శనివారం రామయ్యపుట్టుగలో విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో యువకుల భవిష్యత్‌ను జగన్‌రెడ్డి నాశనం చేశారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని చెప్పి మోసం చేసిం దని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా ఒక్క పరిశ్రమను తీసుకు రాకుండా కమీషన్ల కోసం ఉన్నవాటిని తరిమేసి యువకులను నాశనం చేసిందని దుయ్యబట్టారు. 20 నెలల్లో లక్షల కోట్ల పెట్టుబడితో 25 లక్షల ఉద్యో గాల కల్పించే కంపెనీలతో కూటమి ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు. ఉద్యోగాల భర్తీలో విద్య, పోలీస్‌శాఖలకు పెద్దపీట వేసినట్లు తెలిపారు. పారదర్శకంగా, వేగవంతంగా నియామక ప్రక్రియ చేపట్టి యువతకు ఉద్యోగాల కల్పించడమే ప్రభుత్వ లక్ష్య మని పేర్కొన్నారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్‌ మణిచంద్రప్రకాష్‌, నాయకులు సంతోష్‌పట్నాయక్‌, బాసుదేవ్‌రౌళో,చిన్నబాబు, గిరిబాబు పాల్గొన్నారు.

ఈదుపురం నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం

ఇచ్ఛాపురం, మార్చి 21(ఆంధ్రజ్యోతి): అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఈదుపురం నుంచి ఆర్టీసీ బస్సు ప్రారంభించినట్లు ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ తెలిపారు. శనివారం ఈదుపురంలో ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. కార్యక్రమంలో పలాస ఆర్టీసీ డిపో మేనేజర్‌ ఎం.శ్యాంసుందర్‌ నాయుడు, అసిస్టెంట్‌ మేనేజర్‌ కరుణశ్రీ, విజిలెన్స్‌ హెచ్‌సీ రామ్మోహన్‌రావు, రెడ్డిక కార్పొరేషన్‌ చైర్మన్‌ కొండా శంకరరెడ్డి, పీఏసీఎస్‌ అధ్యక్షుడు పెదిని బాబ్జీ, ఏఎంసీ చైర్మన్‌ మణిచంద్రప్రకాష్‌, జెడ్‌ఆర్‌యూసీసీ సభ్యుడు శ్రీనివాస్‌ రౌళో, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి రాజు, దుర్యోదనరెడ్డి, లోపింటి పద్మనాభం, ఢిల్లీ రావు, సూర్యనారాయణ, వివేకానందరెడ్డి, చంద్రశేఖర్‌, సహాదేవ్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2026 | 11:59 PM