మహిళలకు ఝాన్సీలక్ష్మీభాయి ఆదర్శం
ABN , Publish Date - Nov 20 , 2026 | 12:32 AM
ప్రఽథమ స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటీష్ వారిని గడగడలాడించిన ఝాన్సీలక్ష్మీభాయిమహిళలకు ఆదర్శంగా నిలిచారని వక్తలు పేర్కొన్నారు. గురువారం శ్రీకాకుళంలోని శాంతినగర్‌కాలనీలో గల గాంధీ మందిరం వద్ద మందిరప్రతినిధులు ఝాన్సీలక్ష్మీభాయి జయంతి పురస్కరించు కుని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పాత శ్రీకాకుళం/ శ్రీకాకుళం కల్చరల్, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): ప్రఽథమ స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటీష్ వారిని గడగడలాడించిన ఝాన్సీలక్ష్మీభాయిమహిళలకు ఆదర్శంగా నిలిచారని వక్తలు పేర్కొన్నారు. గురువారం శ్రీకాకుళంలోని శాంతినగర్‌కాలనీలో గల గాంధీ మందిరం వద్ద మందిరప్రతినిధులు ఝాన్సీలక్ష్మీభాయి జయంతి పురస్కరించు కుని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ చిన్నతనం నుంచే దేశభక్తిని అణువణువునా నిం పుకొన్న లక్ష్మీభాయి బ్రిటీష్‌వారి పాలనను వ్యతిరేకించారని తెలిపారు. కార్యక్రమంలో మందిర ప్రతినిధులు సురంగి మోహన రావు, నిష్ఠల నరసింహమూర్తి, పొన్నాడ రవికుమార్, బరాటం లక్ష్మణరావు, ఎంవీఎస్ శాస్త్రీ, చౌదరి రాధాకృష్ట, నాగేశ్వరరావు, మురళి, రాజారావు పాల్గొన్నారు.