Share News

ప్రశాంతంగా..

ABN , Publish Date - Jan 22 , 2026 | 12:16 AM

JEE Mains exams జాతీయస్థాయిలో ఎన్‌ఐటీల్లో ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్స్‌ ఫేజ్‌-1 ఆన్‌లైన్‌ పరీక్షలు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఆధ్వర్యంలో బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి.

ప్రశాంతంగా..
నరసన్నపేట కోర్‌ టెక్నాలజీ కేంద్రం వద్ద పరీక్షకు హాజరైన అభ్యర్థులు

జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభం

నరసన్నపేట/ ఎచ్చెర్ల, జనవరి 21(ఆంధ్రజ్యోతి): జాతీయస్థాయిలో ఎన్‌ఐటీల్లో ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్స్‌ ఫేజ్‌-1 ఆన్‌లైన్‌ పరీక్షలు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఆధ్వర్యంలో బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని శ్రీ శివానీ ఇంజనీరింగ్‌ కళాశాల (చిలకపాలెం), కోర్‌ టెక్నాలజీ (నరసన్నపేట) కేంద్రాల్లో ఈ నెల 28 వరకు పరీక్షలు జరగనున్నాయి. శ్రీ శివానీ ఇంజనీరింగ్‌ కళాశాలలో బుధవారం ఉదయం పరీక్షకు 82 మంది అభ్యర్థులకుగాను 81 మంది, మధ్యాహ్నం 89 మందికి 86 మంది హాజరయ్యారు. నరసన్నపేటలోని కోర్‌ టెక్నాలజీలో రెండు షిఫ్ట్‌ల్లో కలిపి 596 మంది అభ్యర్థులకుగాను 587 మంది పరీక్ష రాశారు. నిర్ణీత సమయానికి రెండు గంటలు ముందుగానే అభ్యర్థులను అనుమతించారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించారు. కాగా.. కోర్‌ టెక్నాలజీ కేంద్రం వద్ద వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది జాడ కనిపించలేదు. కనీసం ప్రథమ చికిత్స కిట్లు కూడా లేకపోవడంతో అభ్యర్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Jan 22 , 2026 | 12:16 AM