Share News

జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభం

ABN , Publish Date - Apr 03 , 2026 | 12:15 AM

JEE Mains.. నరసన్నపేటలోని కోర్‌ టెక్నాలజీలో గురువారం జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమాయ్యయి. రెండు షిఫ్ట్‌ల్లో 439 మంది అభ్యర్థులకుగాను 428 మంది పరీక్షలు రాశారు. 11 మంది గైర్హాజరయ్యారు.

జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభం
నరసన్నపేటలో పరీక్ష రాసేందుకు హాజరైన విద్యార్థులు

428 మంది హాజరు.. 11 మంది గైర్హాజరు

కేంద్రం వద్ద కానరాని వైద్యఆరోగ్య శాఖ సిబ్బంది

నరసన్నపేట, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): నరసన్నపేటలోని కోర్‌ టెక్నాలజీలో గురువారం జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమాయ్యయి. రెండు షిఫ్ట్‌ల్లో 439 మంది అభ్యర్థులకుగాను 428 మంది పరీక్షలు రాశారు. 11 మంది గైర్హాజరయ్యారు. ఉదయం సెషన్స్‌లో ఒకరు, మధ్యాహ్నం 10 మంది అభ్యర్థులు హాజరు కాలేదు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా.. రెండు గంటలు ముందుగానే కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతించారు. ఉదయం షిఫ్ట్‌లో ప్రశ్నపత్రం సరళంగా ఉండగా.. మధ్యాహ్నం మాత్రం కఠినంగా ఉందని విద్యార్థులు తెలిపారు. పరీక్షా కేంద్రం బయట విద్యార్థుల తల్లిదండ్రుల సందడి కనిపించింది. కాగా.. పరీక్ష సమయంలో విద్యార్థులు ఎటువంటి అనారోగ్యానికి గురైనా తక్షణమే వైద్యసేవలు అందించేందుకుగాను.. వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది లేకపోవడం గమనార్హం. కనీసం ప్రథమ చికిత్స కిట్లు కూడా అందుబాటులో లేకపోవడంతో అభ్యర్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Apr 03 , 2026 | 12:15 AM