‘జయక్క పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి’
ABN , Publish Date - Feb 25 , 2026 | 12:07 AM
శ్రీకాకుళ రైతాంగ పో రాటంలో జయ క్క చేసిన పోరా టాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు.
పలాసరూరల్, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళ రైతాంగ పో రాటంలో జయ క్క చేసిన పోరా టాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరంలో మంగళవారం జయక్క ఆరో వర్ధంతి సభను సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యవక్తగా హాజరైన రాష్ట్ర కార్యద ర్శి పోలా ఈశ్వరరావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలకు, కార్యక్రమాలకు తూట్లు పొడుస్తుందని వాటిని జయక్క పోరాట స్ఫూర్తితో తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.లక్ష్మి మాట్లాడు తూ.. శ్రీకాకుళం సాయుధ పోరాటంలో జయక్క పోరు నేటి యువతకు ఆదర్శ మన్నారు. తొలుత జయక్క చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. కార్యక్రమంలో సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయకార్యదర్శి వంకల మాధవరావు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్రప్రధాన కార్య దర్శి ఎస్.రాజశేఖర్, సీపీఐఎంఎల్ లిబరేషన్ నాయకులు మద్దిల మల్లేశ్వరరావు, జిల్లా కార్యదర్శి తామాడ సన్యాసిరావు, పౌరహక్కుల సంఘం కార్యదర్శి పత్తిరి దానేసు, అమరవీరుల బంధుమిత్రుల కమిటీ నాయకులు కోదండరావు, పీడీఎం నాయకులు వీరాస్వామి పాల్గొన్నారు.