అధికార లాంఛనాలతో జవాన్ అంత్యక్రియలు
ABN , Publish Date - Aug 14 , 2026 | 11:36 PM
దేశ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్‌ఏ)లో జవాన్‌గా విధులు నిర్వహిస్తూ ఈనెల 12న హిమాచల్‌ప్రదేశ్‌లో గుండెపోటుతో మరణించిన జవాన్ ఎంవీఎస్‌ఎన్ గిరి అంత్య క్రియలు శుక్రవారం అధికార అంఛనాలతో నిర్వహించారు.
ఆమదాలవలస, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): దేశ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్‌ఏ)లో జవాన్‌గా విధులు నిర్వహిస్తూ ఈనెల 12న హిమాచల్‌ప్రదేశ్‌లో గుండెపోటుతో మరణించిన జవాన్ ఎంవీఎస్‌ఎన్ గిరి అంత్య క్రియలు శుక్రవారం అధికార అంఛనాలతో నిర్వహించారు. జవాన్ మృతదేహం స్వగ్రామమైన తిమ్మాపురానికి గురువారం రాత్రి చేరింది. అయితే రాత్రివేళ దహన సంస్కారాలు చేపట్టకూడదనే సంప్రదాయం మేరకు శుక్ర వారం చేపట్టారు. సైనికాధికారులు, స్థానిక పోలీసులు పాల్గొని మృతదేహంపై జాతీయ జెండాను ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. గౌరవ సూచికంగా గాలిలోకి కాల్పులు జరిపి అంతిమ వీడ్కోలు పలికారు. ఆ జాతీయ జెండాను ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. 22 ఏళ్ల పాటు దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహించిన గిరి మృతదేహాన్ని చూసి నివాళి అర్పించేందుకు పెద్ద ఎత్తున గ్రామస్థులు, స్నేహితులు, అభిమానులు తరలి వచ్చారు. ఇంటి పెద్ద దిక్కు మృతి చెందడంతో భార్య హేమలత, ఇద్దరు పిల్లలు, కుటుంబ సభ్యులు, గ్రామ స్థులు కన్నీరుమున్నీరుగా రోదించారు.