Share News

దౌర్జన్యానికి పాల్పడిన వ్యక్తికి జైలు

ABN , Publish Date - Nov 06 , 2026 | 11:49 PM

మహిళను అవహేళన చేసినందుకు ప్రశ్నించిన ఆమె భర్తపై దౌర్జన్యానికి పాల్పడిన నిందితుడికి మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ పాతపట్నం జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఎం.రోషిణి శుక్రవారం తీర్పు చెప్పినట్లు సారవకోట ఎస్‌.ఐ. అనిల్‌ కుమార్‌ తెలిపారు.

   దౌర్జన్యానికి పాల్పడిన వ్యక్తికి జైలు

జలుమూరు (సారవకోట), నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): మహిళను అవహేళన చేసినందుకు ప్రశ్నించిన ఆమె భర్తపై దౌర్జన్యానికి పాల్పడిన నిందితుడికి మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ పాతపట్నం జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఎం.రోషిణి శుక్రవారం తీర్పు చెప్పినట్లు సారవకోట ఎస్‌.ఐ. అనిల్‌ కుమార్‌ తెలిపారు. పోలీసుల కథనం మేరకు 2020 ఆగస్టు 8న కూర్మనాథపురం గ్రామానికి చెందిన రోణంకి పద్మాంబ పాల కేంద్రం నుంచి పాలు తీసుకొని ఇంటికి వెళుతుండగా... అదే గ్రామానికి చెందిన సత్తారు మాధవరావు పాత కక్షలు మనసులో పెట్టుకొని హేళన చేశాడు. దీనిపై ఆమె భర్త రోణంకి వెంకట అప్పారావు ప్రశ్నించడంతో మాధవరావు ఇటుకతో అతని తలపై కొట్టి గాయపరిచాడు. రోణంకి తవిటినాయుడు గొడవను ఆపడానికి ప్రయత్నించగా మాధవరావు, సత్తారు వెంకటరావు సాయంతో కొట్టినట్టు వెంకట అప్పారావు అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్‌.ఐ ఎ.రవికుమార్‌ కేసు నమోదు చేసి.. చార్జిషీటు దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం సత్తారు మాధవరావుకు మూడు నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ న్యాయాధికారి ఎం.రోషిణి తీర్పునిచ్చినట్టు ఎస్‌ఐ తెలిపారు. సత్తారు వెంకటరావు నేరం రుజువు కానందున ఆయనపై కేసు కొట్టివేసినట్లు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ తరఫున ఆర్‌.గిరిజారాణి వాదనలు వినిపించారు.

Updated Date - Nov 06 , 2026 | 11:49 PM