సారా కేసులో వ్యక్తికి జైలు, జరిమానా
ABN , Publish Date - Jan 17 , 2026 | 12:22 AM
సారాతో పట్టుబడిన కేసులో ఓ వ్యక్తికి ఏడాది పాటు జైలు శిక్షతోపాటు రూ.2లక్షలు జరిమానా విధిస్తూ టెక్కలి జేఎఫ్‌సీఎం కోర్టు మెజిస్ట్రేట్ వి.మాధురి శుక్రవారం తీర్పునిచ్చినట్లు ప్రొహిబిషన్ ఎక్సైజ్‌శాఖ సీఐ షేక్ మీరాసాహెబ్ తెలిపారు.
టెక్కలి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): సారాతో పట్టుబడిన కేసులో ఓ వ్యక్తికి ఏడాది పాటు జైలు శిక్షతోపాటు రూ.2లక్షలు జరిమానా విధిస్తూ టెక్కలి జేఎఫ్‌సీఎం కోర్టు మెజిస్ట్రేట్ వి.మాధురి శుక్రవారం తీర్పునిచ్చినట్లు ప్రొహిబిషన్ ఎక్సైజ్‌శాఖ సీఐ షేక్ మీరాసాహెబ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెళియాపుట్టి మండలం వీరన్నపేట గ్రామానికి చెందిన మల్లేష్ 2022 ఏప్రిల్ 19న 20లీటర్ల సారాతో పట్టుబడగా కేసు నమోదు చేశారు. కాగా ఈ కేసును ప్రభుత్వ తరఫున ఏపీపీ సుధారాణి వాదనలు వినిపించారు. నిందితుడ్ని శ్రీకాకుళం జిల్లా జైలుకు తరలించినట్టు తెలిపారు.