Share News

మెగా డీఎస్సీపై జగన్‌వి తప్పుడు ఆరోపణలు

ABN , Publish Date - Jun 13 , 2026 | 12:10 AM

మెగా డీఎస్సీ-2025పై వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి నిరాధార ఆరోపణలతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని శ్రీకాకు ళం పార్లమెంట్‌ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు బలగ ప్రహర్ష అన్నారు. ఈ

 మెగా డీఎస్సీపై జగన్‌వి తప్పుడు ఆరోపణలు
మాట్లాడుతున్న టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు బలగ ప్రహర్ష

పార్లమెంట్‌ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు బలగ ప్రహర్ష

అరసవల్లి, జూన్‌ 12(ఆంధ్ర జ్యోతి): మెగా డీఎస్సీ-2025పై వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి నిరాధార ఆరోపణలతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని శ్రీకాకు ళం పార్లమెంట్‌ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు బలగ ప్రహర్ష అన్నారు. ఈ మేరకు శుక్రవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మా ట్లాడుతూ.. నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేస్తున్నారని విమర్శిం చారు. కూటమి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మెగా డీఎస్సీ నిర్వహించిం దన్నారు. నోటిఫికేషన్‌ విడు దలైన తరువాత కోర్టుల్లో 240 కేసులు దాఖలైన ప్పటికీ కోర్టులు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు నివ్వడంతో నియామక ప్రక్రియ సజావుగా సాగిందన్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఎస్సీ వర్గీకరణతో పాటు మహిళలు, దివ్యాంగులు, క్రీడాకారులకు రిజర్వేషన్లను అమలుచేసింద న్నారు. మెగా డీఎస్సీపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మ వద్దని నిరుద్యోగ యువతను కోరారు. కార్యక్రమంలో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జనరల్‌ సెక్రటరీ సుమంత్‌ గుర్రాల, శ్రీకాకుళం నియో జకవర్గ అధ్యక్షుడు గొండు శ్యామ్‌, పట్టణ అధ్య క్షుడు చిట్టి సాయికిరణ్‌, కార్యదర్శి తరిగొప్పుల వంశీ, భార్గవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 13 , 2026 | 12:10 AM