Share News

అపరిచితుడిలా జగన్‌ వ్యవహారం: బగ్గు

ABN , Publish Date - Jul 08 , 2026 | 12:06 AM

‘వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహారశెలి చూస్తుంటే రాష్ట్ర ప్రజలో అయోమయం కలుగుతోంది. అపరిచితుడిలా వ్యవహరిస్తున్నార’ని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లడారు. వైఎస్‌ జగన్‌మెహన్‌రెడ్డి 2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని అన్నారని.. అఽధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానులు అన్నారని గుర్తు చేశారు.

 అపరిచితుడిలా జగన్‌ వ్యవహారం: బగ్గు
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రమణమూర్తి :

నరసన్నపేట, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహారశెలి చూస్తుంటే రాష్ట్ర ప్రజలో అయోమయం కలుగుతోంది. అపరిచితుడిలా వ్యవహరిస్తున్నార’ని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లడారు. వైఎస్‌ జగన్‌మెహన్‌రెడ్డి 2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని అన్నారని.. అఽధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానులు అన్నారని గుర్తు చేశారు. ఆ తరువాత విశాఖపట్నం రాజధాని అన్నారని అన్నారు. మొన్న మావిగన్‌ అని... నిన్న విజయవాడ అంటూ స్థిరత్వం లే కుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్నీరంగాల్లో అభివృద్ధి చెందుంతోందన్నారు. దీనిని వైసీపీ నాయకుడు ఓర్వలేక రాజధానులు పేరుతో చిచ్చు పెడుతూ.. కులమత విద్వేషాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు.

Updated Date - Jul 08 , 2026 | 12:06 AM