అశాంతిని సృష్టించేందుకు జగన్ ప్రయత్నం
ABN , Publish Date - Aug 01 , 2026 | 12:10 AM
రాష్ట్రంలో అశాంతిని సృష్టించేందుకు వైసీపీ అధినేత జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, ఇది అతని నైజమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్
అరసవల్లి, జూలై 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అశాంతిని సృష్టించేందుకు వైసీపీ అధినేత జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, ఇది అతని నైజమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శుక్రవారం విశాఖ ఎ కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడు తూ.. మాజీమంత్రి సీదిరి పరామర్శ పేరుతో జగన్‌రెడ్డి చేసిన హంగామా, వైసీపీ నాయకులు ప్రవర్తించిన తీరును ప్రజలంతా గమనించార న్నారు. 16 నెలలు జైలులో ఉన్న జగన్‌కు సా యంత్రం 5.30 గంటల తరువాత ములాఖత్ ఉండదని తెలియదా అని ప్రశ్నించారు. అనుమ తులు లేకుండా రోడ్‌షోలు చే యడం, విఽధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్‌ఐపై వైసీపీ నాయ కుడు చింతాడ రవికుమార్, అతని అనుచరులు ప్రవర్తించిన తీరు అత్యంత హేయమని అన్నా రు. సమావేశంలో పీఎంజేబాబు, పి.అప్పల నాయుడు, కె.శివ తదితరులు పాల్గొన్నారు.
‘సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్’
ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఈ మేరకు తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ పరిష్కారానికి కృషి చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు పాండ్రంకి శంకర్, ఎంఎస్‌ఎంఈ డైరెక్టర్ ప్రధాన విజయరాం, నేతలు పీఎంజే బాబు, కలగ జగదీష్, కలగ శివ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘నషాముక్త భారత్’ పోస్టర్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.