Share News

అమరావతిపై జగన్‌ అక్కసు: పిసిని

ABN , Publish Date - Apr 03 , 2026 | 12:17 AM

అంతర్జాతీయ ప్రమాణాలతో అమ రావతిలో రాష్ట్ర రాజధాని నిర్మాణం జరుగుతుంటే జగన్‌ అక్కసు వెళ్లగక్కారని జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాల అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్‌ తెలి పారు.

అమరావతిపై జగన్‌ అక్కసు: పిసిని
శ్రీకాకుళం అర్బన్‌: మాట్లాడుతున్న చంద్రమోహన్‌

శ్రీకాకుళం అర్బన్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ ప్రమాణాలతో అమ రావతిలో రాష్ట్ర రాజధాని నిర్మాణం జరుగుతుంటే జగన్‌ అక్కసు వెళ్లగక్కారని జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాల అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్‌ తెలి పారు. గురువారం శ్రీకాకుళంలో ఏర్పాటుచేసిన సమావే శంలో ఆయన మా ట్లాడు తూ జగన్‌ పత్రికా సమావేశంలో పవన్‌కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసు కొని, క్షమాపణ చెప్పకపోతే బుద్ది చెబుతామన్నారు. ఏమైనా అనుమానాలు ఉంటే అసెంబ్లీకి వెళ్లి మాట్లాడాల్సిందిపోయి అక్కడ అడుగు పెట్టకుండా బయట మాట్లా డుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. రాజధాని విషయంలో వైసీపీకి విధానం, స్పష్టం కాని లేదన్నారు. అభివృద్ధిని ఓర్వలేకే జగన్‌ అవాక్కులు, చవాకులు మాట్లాడుతున్నారన్నారు. సమావేశంలో జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు పాపారావు, శ్రీకాకుళం నియోజకవర్గం ఇన్‌చార్జి కోరాడ సర్వేశ్వరరావు, నాయకులు మామిడి విష్ణు, బొట్ట శంకర్‌, బుచ్చిబాబు, ముంగి జగదీశ్వరరావు పాల్గొన్నారు.

అమరావతి బిల్లుకు కాంగ్రెస్‌ మద్దతు

ఆమదాలవలస, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిగా చట్టబద్దత కల్పించేందుకు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బిల్లుకు కాంగ్రెస్‌ పార్టీ మద్దతు తెలిపిందని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు తెలిపా రు. గురువారం ఆమదాలవలసలో విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ కూడా స్పందిస్తూ రాష్ట్రాభివృద్ధి కోసం కాంగ్రెస్‌ పార్టీ ఎల్లవేళలా పనిచేస్తుందని స్పష్టం చేసినట్టు తెలిపారు.

Updated Date - Apr 03 , 2026 | 12:17 AM