అరాచక పాలనకు కేరాఫ్ జగన్‌రెడ్డి
ABN , Publish Date - Oct 03 , 2026 | 12:17 AM
రాష్ట్రంలో ఐదేళ్ల వైసీపీ పాలనలో అరాచకం పేట్రేగి దాష్టిక పాలనకు కేరాఫ్‌గా జగన్ రెడ్డి నిలిచారని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు.
ఎమ్మెల్యే కూన రవికుమార్
ఆమదాలవలస, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఐదేళ్ల వైసీపీ పాలనలో అరాచకం పేట్రేగి దాష్టిక పాలనకు కేరాఫ్‌గా జగన్ రెడ్డి నిలిచారని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. శు క్రవారం పట్టణంలోని మునిసిపల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎన్‌నినో ప్రభా వం ఉందని, అయితే జగన్‌రెడ్డి నుంచి పిల్ల సైకోల వర కు కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఏ ప్రాంతంలోనైనా కరువు ప్రాం తాన్ని గుర్తించాలంటే ఖరీఫ్ సాగు ప్రారంభించి సుమారు మూడు నెలలంటే సెప్టెంబరు నెలాఖరు వరకు అధికా రులు నివేదికలు రూపొందించడం జరుగుతుంద న్నారు. ఇటీవల ఆరు ప్రభుత్వశాఖల నివేదికలు ఆధా రంగా రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభా వంతో 388 మండలాల్లో కరువు ఉందని, వాటిలో 283 మండలాలను అత్యంత కరువు మండలాలుగా ప్రభుత్వం గురువారం రాత్రి ప్రకటించింద న్నారు. వీటిలో శ్రీకాకుళం జిల్లాలో ఐదు మండలాల్లో కరువు ప్రాంతా లుగా ఉండగా వాటిలో వాటిలో ఆమదా లవలస నియోజకవర్గంలో పొందూరు, ఆమదాలవలస, బూర్జ మండలాలు, ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం, జి.సిగడాం మండలాలుగా కూడా ఉన్నాయ న్నారు. కరువు ప్రకటించిన మండలాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్‌పుట్ సబ్సిడీ, వ్యవసాయ రుణాల రీషెడ్యూల్, 90 శాంత సబ్సిడీతో విత్తనలు, పరిక రాలు అందిస్తాయన్నారు. అలాగే వీబీజీరామ్‌జీ పథకంలో కరువు ప్రాంత ప్రజలకు అదనంగా ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన 366 మందికి వరద సాయం అందించామ న్నారు. తుఫాన్ సాయంపై వైసీపీ నేతలు, కార్యకర్తలు అసత్య ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. వరద ముంపు నకు గురైన బూర్జ మండలం అల్లెన గ్రామానికి చెందిన 571 మంది కుటుంబాలకు వరద సాయం అందించా మన్నా రు. కార్యక్రమంలో మునిసిపల్ మాజీ చైర్‌పర్సన్ తమ్మి నేని గీతా విద్యాసాగర్, టీడీపీ నాయకులు ఎన్ని శ్రీదేవి, తాడేల రాజారావు, అన్నెపు భాస్కరరావు, పీవీకే రాజు, తమ్మినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.