రాయలసీమ అభివృద్ధికి జగనే అడ్డంకి
ABN , Publish Date - Oct 03 , 2026 | 12:11 AM
రాయలసీమ సమగ్రాభివృద్ధికి ప్రధాన అడ్డంకి వైసీపీ అధినేత జగన్ అని, అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్నారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు విమర్శించారు.
ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
రణస్థలం, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ సమగ్రాభివృద్ధికి ప్రధాన అడ్డంకి వైసీపీ అధినేత జగన్ అని, అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్నారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు విమర్శించారు. ఈ మేరకు తన కార్యాల యంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. ము ఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూట మి ప్రభుత్వం సీమను ప్రపంచ స్థాయి ఉద్యాన కేం ద్రంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు శ్రమిస్తుంటే, చూసి ఓర్వలేక జగన్ విషప్రచారం సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులకు దగా చేసిన జగన్ రెడ్డి వైసీపీ ఐదేళ్ల పాలనలో రాయలసీమకు తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో కూట మి నాయకులు లంక శ్యామలారవు, డీజీఎం ఆనంద రావు, పిసిని జగన్నాధంనాయుడు పాల్గొన్నారు.
మొక్కలు విరివిగా నాటాలి
మొక్కలు విరివిగా నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చె ర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి లంక శ్యామలరావు, ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు అన్నారు. ‘సేవా మేరా యోగ్‌దాస్’లో భాగంగా శుక్రవారం బీసీ బాలుర వసతి గృహం ప్రాంగణంలో మొక్కలు నాటారు.