Share News

రాష్ట్రస్థాయి యోగా పోటీలకు జగదీష్‌

ABN , Publish Date - Aug 06 , 2026 | 11:56 PM

బెల్లుపడ కాలనీకి చెందిన పాలేపు సాయి జగదీష్‌ జిల్లా స్థాయి అమరావతి చాంపియన్‌షిప్‌ యోగా పోటీల్లో సత్తా చాటి రాష్ట్ర పోటీలకు ఎంపికయ్యాడు.

రాష్ట్రస్థాయి యోగా పోటీలకు జగదీష్‌
జిల్లా స్థాయి పోటీలో యోగా విన్యాసం చేస్తున్న జగదీష్‌

ఇచ్ఛాఫురం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): బెల్లుపడ కాలనీకి చెందిన పాలేపు సాయి జగదీష్‌ జిల్లా స్థాయి అమరావతి చాంపియన్‌షిప్‌ యోగా పోటీల్లో సత్తా చాటి రాష్ట్ర పోటీలకు ఎంపికయ్యాడు. ఈ మేరకు గురువారం శ్రీకాకుళం ఇండోర్‌ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో అండర్‌-17 విభాగంలో యోగాసనాలు ప్రదర్శించి ప్రథమ స్థానం పొందాడు. ఈ మేరకు జగదీష్‌ను ఉపాధ్యా యులు, తల్లిదండ్రులు, క్రీడాభిమానులు అభినందించారు.

Updated Date - Aug 06 , 2026 | 11:56 PM