Share News

నువ్వలరేవులో నవమి వేడుకలకు వేళాయె

ABN , Publish Date - Mar 19 , 2026 | 12:26 AM

జిల్లాలో ప్రత్యేక సంప్రదాయా లకు నిలయమైన నువ్వలరేవు గ్రా మంలో శ్రీరామ నవమి వేడుకలకు ఏ ర్పాట్లు చేస్తున్నారు.

నువ్వలరేవులో నవమి వేడుకలకు వేళాయె

వజ్రపుకొత్తూరు, మార్చి 18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రత్యేక సంప్రదాయా లకు నిలయమైన నువ్వలరేవు గ్రా మంలో శ్రీరామ నవమి వేడుకలకు ఏ ర్పాట్లు చేస్తున్నారు. మూడు వందల ఏళ్లుగా ఏటా తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయి తీ. ఉగాది రోజున గ్రామదేవత బృం దావతి, శ్రీరాముని ఆలయంలో ప్ర త్యేక పూజలు చేస్తారు. అనంతరం ఆ దివారం నుంచి మూడు రోజుల పాటు గ్రామదేవ తలకు మొక్కులు తీర్చుకుంటారు. రెండు రోజుల విశ్రాంతి అనంతరం శ్రీరామ నవమి నుంచి తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలను నిర్వహిస్తారు. ఏప్రిల్‌ 2న రావణ దహనంతో ఉత్సవాలు ముగు స్తాయి. తొమ్మిది రోజులు పాటు రామాయణ ఘటాలతో నాటకాలు ప్రదర్శిస్తారు.

సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం

శ్రీరామ నవమి ఉత్సవాలను 300 ఏళ్లుగా కొనసాగిస్తున్నాం. గ్రా మస్థులు ఎంతో భక్తి శ్రద్ధలతో వేడుకలను నిర్వహిస్తారు. ఇప్పటికే వివిధ ప్రాంతాలలో ఉన్న వారు గ్రామానికి చేరుకున్నారు. అంద రం కలసి వేడుకలు నిర్వహిస్తాం.

శాంతియుతంగా నిర్వహించుకోవాలి

డీఎస్పీ లక్ష్మణరావు

శ్రీరామనవమి ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలని కాశీబుగ్గ ఇన్‌చార్జి డీఎస్పీ డి.లక్ష్మ ణరావు సూచించారు. బుధవారం సాయంత్రం నువ్వలరేవు గ్రామదేవత బృందావతి ఆలయం వద్ద గ్రామపెద్దలతో మాట్లాడారు. మందుగుండ సామగ్రిని వినియోగించరాదన్నారు. సర్పంచ్‌ ము వ్వల పూర్ణచంద్ర, ఎంపీటీసీ సభ్యుడు వెంకటేష్‌లు ఉత్సవాల విశిష్టతను డీఎస్పీకి వివరించారు.

నువ్వలరేవులో వెలసిన సీతారామ ఆలయం

Updated Date - Mar 19 , 2026 | 12:26 AM