Share News

బొరివంకలో అమ్మవార్లకుచల్లదనం

ABN , Publish Date - Jun 07 , 2026 | 11:36 PM

బొరివంకలోని అసిరిపోలమ్మ,కాళీమాత అమ్మవా ర్లకు ఆదివారం చల్లదన మహోత్సవాన్ని నిర్వహించారు. గజముద్దలను ఊరేగించి, కాళికా వేషధారణలతో నృత్యాలు చేస్తూ వీధుల్లో పర్యటించారు.

బొరివంకలో అమ్మవార్లకుచల్లదనం
ఇచ్ఛాపురం: అమ్మవారిని ఘటాలతో ఊరేగిస్తున్న భక్తులు:

కవిటి, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి)ః బొరివంకలోని అసిరిపోలమ్మ,కాళీమాత అమ్మవా ర్లకు ఆదివారం చల్లదన మహోత్సవాన్ని నిర్వహించారు. గజముద్దలను ఊరేగించి, కాళికా వేషధారణలతో నృత్యాలు చేస్తూ వీధుల్లో పర్యటించారు.

ఫఇచ్ఛాపురం, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): మండలంలోని లొద్దపుట్టి గ్రామదేవత ధనరాజ తులసమ్మతల్లి సంబరాన్ని ఆదివారం భక్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. టీడీపీ నాయకుడు, 22వ వార్డు మాజీ కౌన్సిలర్‌ కాళ్ల దిలీప్‌ దం పతులు సంబరంచ్రేశారు. అమ్మవారి ఘటాలు, పానకాల బిందెలు, కాళీకా నృత్యా లతో పురవీధుల్లో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చు కున్నారు. తీసుకెళ్లిన పానకాలు, పసుపు నీరు బిందెలతో అమ్మవారికి అభిషేకిం చారు. కార్యక్రమంలో కాళ్ల సత్యం, వీరాస్వామి, తిరుపతి, కాళ్ల అర్జున పాల్గొన్నారు.

ఫసోంపేట రూరల్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): మండలంలోని సిరిమామిడిలో జరుగుతున్న సంబరాల్లో ఆదివారం రాత్రి ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అశోక్‌ పాల్గొన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. అనం తరం గ్రామదేవత పోలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చంద్రమోహన్‌, టీడీపీ పంచాయతీ అధ్యక్షుడు కారాగి షన్ముఖరావు, బత్తిన ఢిల్లేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2026 | 11:36 PM