జగన్ వత్తాసు పలకడం సిగ్గుచేటు
ABN , Publish Date - Feb 01 , 2026 | 11:08 PM
వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు వంటి నీచవ్యక్తులను ఆ పార్టీ అధినేత జగన్ వత్తాసు పలకడం సిగ్గుచేటు అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు పేర్కొన్నారు.
లావేరు, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు వంటి నీచవ్యక్తులను ఆ పార్టీ అధినేత జగన్ వత్తాసు పలకడం సిగ్గుచేటు అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని రావివలసలో విలేకరులతో మాట్లాడుతూ రాంబాబు వంటి నీచమైన వ్యక్తులకు 16 నెలలు జైలులో ఉండి రూ.43 వేలు కోట్లు అవినీతికి పాల్పడిన వైసీపీ పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వత్తాసు పలుకడం సిగ్గుచేటు అన్నారు. రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడుపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తాను 43 ఏళ్లుగా రాజకీ యాల్లో ఉన్నానని, తొమ్మిదిమంది ముఖ్యమంత్రులను, 1500కు పైగా ఎమ్మెల్యేలు, ఎంపీలను చూశానని తెలిపారు. అంబటి రాంబాబు వంటి నీచమైన మాట్లాడిన వ్యక్తులు కుటుంబాలతో ఎలా వ్యవరిస్తున్నారో అర్థం కావడం లేదని తెలిపారు. సమావేశంలో లావేరు మండల టీడీపీ అధ్యక్షుడు ముప్పిడి సురేష్, ఏఎంసీ మాజీ చైర్మన్ తోటయ్యదొర, నాయకులు లంక శ్యామలరావు, నారాయణరావు, పిన్నింటి మధుబాబు, డి.కూర్మారావు పాల్గొన్నారు.
అంబటి క్షమాపణలు చెప్పాలి: కూన
ఆమదాలవలస, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ ఆదివారం ఒక ప్రకటనలో ఖం డించారు. రాంబాబు వ్యాఖ్యలు తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే క్షమాపణలుచెప్పాలని డిమాండ్‌చేశారు. రాజకీయాల్లో విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలని, వ్యక్తిగత దూషణలు చేయడం దిగజారుడుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. గతంలో వైసీపీ నాయకులు దిగజారుడు వ్యాఖ్యలు వల్లే ప్రజలు వైసీపీను 11 సీట్లకే పరిమితం చేశారని తెలిపారు. గొడవలు, హత్యలకు దారితీసే దోరణిని ప్రోత్సహించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. అంబటిని రాజకీయాలు నుంచి బహిష్కరించాలని కోరారు.
సుమోటోగా కేసు నమోదు చేయాలి: శంకర్
అరసవల్లి, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): నాలుగు దశాబ్దాల రాజకీయ అను భవం, ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపు, విజన్ గల నాయకుడు, ముఖ్య మంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నోరు అదుపుటో పెట్టుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసుశాఖ సుమోటోగా కేసు నమోదుచేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంబటి వ్యాఖ్యలు కేవ లం రాజకీయ విమర్శలు కావని, అవి వైసీపీ నాయకుల దిగజారుడుతనానికి, సంస్కారహీనతకు నిదర్శనమని తెలిపారు. మాటతీరు మార్చుకోకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబుకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజాగ్రహంతో పాటు, చట్టపరమైన చర్యలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఫ కవిటి, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబునాయుడుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు హేయమని కవిటి మండల టీడీపీ నేతలు ఖండించారు. ఈ మేరకు కవిటి మండల టీడీపీ అధ్యక్షుడు పి.కృష్ణారావు ఆది వారం ఒకప్రకటన విడుదలచేశారు. రాంబాబు తన వ్యాఖ్యలను ఉపసంహ రించుకొని బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాంశ్‌చేశారు.