Share News

ఐటీఐ అడ్మిషన్ల షెడ్యూల్‌ విడుదల

ABN , Publish Date - Jul 09 , 2026 | 12:27 AM

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లకు బుధవారం షెడ్యూల్‌ విడుదలైనట్టు జిల్లా అడ్మిషన్ల కన్వీనర్‌, ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్‌ ఎల్‌.సుధాకరరావు తెలిపారు.

ఐటీఐ అడ్మిషన్ల షెడ్యూల్‌ విడుదల

-ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐలో 11 నుంచి కౌన్సెలింగ్‌

ఎచ్చెర్ల, జూలై 8(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లకు బుధవారం షెడ్యూల్‌ విడుదలైనట్టు జిల్లా అడ్మిషన్ల కన్వీనర్‌, ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్‌ ఎల్‌.సుధాకరరావు తెలిపారు. ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐలో ఈ కౌన్సెలింగ్‌ ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు జరుగుతుందన్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకున్న వారికి మెరిట్‌ ప్రాతిపదికన ర్యాంకుల వారీగా కౌన్సెలింగ్‌కు పిలుస్తున్నామన్నారు. రెండేళ్ల కాల వ్వవధి గల కోర్సులైన ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, ఎలకా్ట్రనిక్‌ మెకానిక్‌, మెకానిక్‌ మోటార్‌ వెహికల్‌, డ్రాప్ట్స్‌మన్‌ సివిల్‌ కోర్సులకు, అలాగే ఏడాది కాలవ్యవధి గల కోర్సులైన వెల్డర్‌, డీజిల్‌ మెకానిక్‌, టైలరింగ్‌, కంప్యూటర్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని 3 ప్రభుత్వ ఐటీఐల్లో 736 సీట్లు, 20 ప్రైవేటు ఐటీఐల్లో 2,620 సీట్లు ఉన్నట్టు చెప్పారు. అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సిన తేని వారి సెల్‌ఫోన్లకు పంపించామన్నారు. 11 నుంచి 14వ తేదీ వరకు కౌన్సెలింగ్‌కు అనివార్య కారణాల వల్ల హాజరుకాని అభ్యర్థులు, సీట్లు పొందనివారు ఈ నెల 15వ తేదీన ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య కౌన్సెలింగ్‌కు హాజరుకావాలన్నారు.

షెడ్యూల్‌ వివరాలు-

తేదీ ఉదయం మధ్యాహ్నం

(9 నుంచి 1 గంట వరకు) (2 నుంచి 5 గంటల వరకు)

11-7-2026 1-316 ర్యాంకులు 317-584 ర్యాంకులు

(10.0- 8.3 మార్కులు) (8.2- 7.7 వరకు)

12-7-2026 585-903 ర్యాంకుల వరకు 904-1197 ర్యాంకుల వరకు

(7.6-7.0 మార్కులు) (6.8-6.5 మార్కుల వరకు)

13-7-2026 1198-1547 ర్యాంకుల వరకు 1548- 1909 ర్యాంకుల వరకు

(6.3-5.8 మార్కుల వరకు) (5.7- 5.2 మార్కుల వరకు)

14-7-2026 1910-2220 ర్యాంకుల వరకు 2221- 2567 ర్యాంకుల వరకు

(5.0- 4.5 మార్కుల వరకు) (4.4 - 2.2 మార్కుల వరకు)

Updated Date - Jul 09 , 2026 | 12:27 AM