Share News

ప్రతి కార్యకర్త గౌరవం పెంచే బాధ్యత నాది

ABN , Publish Date - Apr 14 , 2026 | 12:47 AM

పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గౌరవం పెంచడం తన ముఖ్యబాధ్యత అని మంత్రి కింజ రాపు అచ్చెన్నాయుడు అన్నారు.

ప్రతి కార్యకర్త గౌరవం పెంచే బాధ్యత నాది
మంత్రి అచ్చెన్నాయుడును సన్మానిస్తున్న నందిగాం టీడీపీ నాయకులు

  • మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గౌరవం పెంచడం తన ముఖ్యబాధ్యత అని మంత్రి కింజ రాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం ని మ్మాడలోని తన క్యాంపు కార్యాలయంలో నందిగాం మండల నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వ హించారు. ఈ సంందర్భంగా పార్టీ మండల అ ధ్యక్షుడు పినకాన జోగారావుతో సహా నాయకులు, కార్యకర్తలు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు పార్టీలో తగిన గుర్తింపు, సుముచిత స్థానం కల్పి స్తామని హామీ ఇచ్చారు. గత ఐదేళ్ల ప్రతిపక్ష కా లంలో కూడా కార్యకర్తలు అంకితభావంతో పని చేసి పార్టీ ప్రతిష్టను కాపాడారని కొనియాడారు. గత 21 నెలల్లో గ్రామీణ స్థాయిలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నా మని మంత్రి వెల్లడించారు. సంక్షేమం, అభివృద్ధి ఫలాలు ప్రతి ఇంటికి చేరేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. త్వరలోనే కొత్త పింఛన్ల మంజూరు పై ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త చెబు తారని తెలిపారు. కార్యక్రమంలో నందిగాం టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2026 | 12:47 AM