రామ్మోహన్‌నాయుడిపై విమర్శలు చేయడం తగదు
ABN , Publish Date - Mar 09 , 2026 | 11:54 PM
కేం ద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడి పై వైసీపీ నాయకులు విమర్శలు చేయడం తగదని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అ న్నారు.
ఎమ్మెల్యే మామిడి గోవిందరావు
పాతపట్నం, మార్చి 9(ఆంధ్రజ్యోతి): కేం ద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడి పై వైసీపీ నాయకులు విమర్శలు చేయడం తగదని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అ న్నారు. తన క్యాంపు కార్యాలయంలో సోమ వారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో కనీసం రోడ్డు సౌకర్యమై నా కల్పించలేక పోయారని, ఇప్పుడు టీడీపీ హయాంలో ప్రతి గ్రామం అభివృద్ధి బాటప డుతుందన్నారు. ఒడిశాతో సంబంధముండే నీటిపారుదల సమస్యలపై కేంద్రమంత్రికి అ వగాహన ఉందన్నారు. నేరడి బ్యారేజీ సమ స్య పరిష్కారం కోసం ఇప్పటికే హామీ ఇచ్చార న్నారు. పాతపట్నంలో నీలమణిదుర్గ అమ్మ వారి ఆలయం వద్ద జాతీయ రహదారి న మూనా మార్చుడంలో చూపినచొరవ అలాగే పలు రోడ్లు, విద్యాసంస్థల నెలకొల్పడంలోనూ చూ పుతున్న చొరవ ఎనలేనిదన్నారు.