నీటి ని కాపాడవలసిన బాధ్యత అందరిది
ABN , Publish Date - Mar 21 , 2026 | 12:11 AM
నీటిని కాపాడవలసిన భాధ్యత సమాజంలో ప్రతి పౌరునిపైనా ఉందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. ఈ నెల 22న ‘అంతర్జాతీయ నీటి దినోత్సవం’ సందర్భంగా స్థానిక న్యాయసేవాసదన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
శ్రీకాకుళం లీగల్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): నీటిని కాపాడవలసిన భాధ్యత సమాజంలో ప్రతి పౌరునిపైనా ఉందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. ఈ నెల 22న ‘అంతర్జాతీయ నీటి దినోత్సవం’ సందర్భంగా స్థానిక న్యాయసేవాసదన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నీటి వినియోగంలో జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో ప్రజలు అనేక ఇబ్బందులు పడవలసి ఉంటుందని హెచ్చరించారు. ప్రజలు నీటి నాణ్యతలో రాజీ పడితే రోగాల పాలు కావలసివస్తుందని అన్నారు. తొలుత జిల్లా కోర్టు నుంచి ఆర్ట్స్ కాలేజీ రోడ్డు కూడలి వరకు న్యాయవాదులు, పారాలీగల్ వలంటీర్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నీటిని కాపాడుతామని సమావేశంలో పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జి.ఇందిరాప్రసాద్, ఆగూరు ఉమామహేశ్వరావు, డొంకాన ఈశ్వరరావు, గురువిల్లి సత్యభామ, గ్రామీణ నీటి యాజమాన్య విభాగం జిల్లా కోఆర్డినేటర్ కె.అమ్మాజీరావు తదితరులు పాల్గొన్నారు