Share News

‘కారా మాస్టారిలా జీవించడం కష్టం’

ABN , Publish Date - Nov 10 , 2026 | 12:03 AM

కష్టప డితే కాళీపట్నం రామారావు (కారా) మాస్టారిలా రచయిత గా ఎదగ వచ్చేమో గాని ఆయ నలా జీవించడం ఎవరికీ సా ధ్యం కాదని రచయిత అట్టాడ అప్పలనాయుడు అన్నా రు.

‘కారా మాస్టారిలా జీవించడం కష్టం’
‘మాస్టారితో నేను’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న రచ యిత అట్టాడ అప్పలనాయుడు

శ్రీకాకుళం కల్చరల్‌, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): కష్టప డితే కాళీపట్నం రామారావు (కారా) మాస్టారిలా రచయిత గా ఎదగ వచ్చేమో గాని ఆయ నలా జీవించడం ఎవరికీ సా ధ్యం కాదని రచయిత అట్టాడ అప్పలనాయుడు అన్నా రు. కారా మాస్టారి 102వ జయంతి కార్యక్రమం సోమవారం విశాఖ- ఎ కాలనీలోని కఽథానిలయంలో నిర్వహించారు. కారా మాస్టా రు చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రచయిత గంట్యాడ గౌరు నాయుడు రచించిన ‘మాస్టారితో నేను’ పుస్తకాన్ని అప్పల నాయుడు ఆవిష్కరించారు. రచయిత నల్లి ధర్మా రావు మాట్లాడుతూ.. కథ కఽంచికి పోకుండా కథా నిలయానికి చేరుకొనే విధంగా కథానిలయం నిర్మించి ప్రపంచ స్థాయిలో కారా మాస్టారు చిరస్థాయిగా నిలిచి పోయారన్నారు. పలువురు వక్తలు మాట్లాడుతూ.. మారుతున్న సమాజానికి అనుగుణంగా కథానిలయంలోని కథల పుస్తకా లను డిజిటలైజ్‌ చేయాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా జరుగుతున్న ప్రయత్నాలకు అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కథా నిలయం కార్యదర్శి దాసరి రామచంద్రరావు, ట్రస్ట్‌ సభ్యులు బి.నారాయణ వేణు, కాళీపట్నం సుబ్బారావు తదితరులుపాల్గొన్నారు.

Updated Date - Nov 10 , 2026 | 12:03 AM