Share News

నాలుగు యుద్ధాల్లో పాల్గొన్నాం.. మా త్యాగాలకు ఫలితం ఇదా?

ABN , Publish Date - Jun 30 , 2026 | 12:21 AM

No action taken despite complaint about land encroachment ‘ఓ సైనికుడి భూమి కొంతమేర ఆక్రమణకు గురైంది. మిగిలిన భూమిని వైసీపీ పాలనలో బంజరు భూమి కింద మార్చేశారు. కార్గిల్‌ యుద్ధ సమయంలో వెన్నుపూస దెబ్బతిని కుర్చీకే పరిమితమైన ఆయన.. రెండేళ్లుగా తన భూమి కోసం పోరాడుతూ.. న్యాయం చేయాలని వేడుకుంటున్నా అధికారులు స్పందించడం లేదు. దీంతో మరోసారి జడ్పీ వేదికగా నిర్వహించే ‘ప్రజాసమస్యల పరిష్కారం వేదిక - మీకోసం’ కార్యక్రమానికి భార్య సహాయంతో వచ్చి అధికారులకు తనగోడు వెల్లడించారు.

నాలుగు యుద్ధాల్లో పాల్గొన్నాం.. మా త్యాగాలకు ఫలితం ఇదా?
మాజీ సైనికుడు లక్ష్మణరావు

  • భూమి ఆక్రమణపై ఫిర్యాదు చేసినా చర్యల్లేవ్‌

  • కార్గిల్‌ యుద్ధ వీరుడు సాసుబిల్లి లక్ష్మణరావు ఆవేదన

  • ‘మీ-కోసం’లో కలెక్టర్‌కు ఫిర్యాదు

  • న్యాయం చేయాలని వేడుకోలు

  • శ్రీకాకుళం కలెక్టరేట్‌, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): ‘ఓ సైనికుడి భూమి కొంతమేర ఆక్రమణకు గురైంది. మిగిలిన భూమిని వైసీపీ పాలనలో బంజరు భూమి కింద మార్చేశారు. కార్గిల్‌ యుద్ధ సమయంలో వెన్నుపూస దెబ్బతిని కుర్చీకే పరిమితమైన ఆయన.. రెండేళ్లుగా తన భూమి కోసం పోరాడుతూ.. న్యాయం చేయాలని వేడుకుంటున్నా అధికారులు స్పందించడం లేదు. దీంతో మరోసారి జడ్పీ వేదికగా నిర్వహించే ‘ప్రజాసమస్యల పరిష్కారం వేదిక - మీకోసం’ కార్యక్రమానికి భార్య సహాయంతో వచ్చి అధికారులకు తనగోడు వెల్లడించారు. దేశం కోసం తాను, తన తండ్రి నాలుగు యుద్ధాల్లో పాల్గొనగా.. తమ త్యాగాలకు ఇచ్చిన ఫలితం ఇదేనా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే..

  • ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరు పంచాయతీ రుప్పపేట గ్రామానికి చెందిన సాసుబిల్లి లక్ష్మణరావు.. గతంలో సైన్యంలో చేరి కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్నారు. యుద్ధ సమయంలో వెన్నుపూస దెబ్బతిని ప్రస్తుతం కుర్చీకే పరిమితమయ్యారు. లక్ష్మణరావు తండ్రి సాసుబిల్లి గురువులు కూడా సైనికుడే. ఆయన గతంలో మూడు యుద్ధాల్లో పాల్గొని భారత ప్రభుత్వం ద్వారా పతకాలు పొందిన వీరుడు. ఆయన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం.. 1978లో రుప్పపేటలో 2.73 ఎకరాల భూమిని కేటాయించింది. కాగా.. తండ్రి ద్వారా తమకు సంక్రమించిన భూమిలో 73 సెంట్లు ఇప్పటికే ఆక్రమణకు గురైందని లక్ష్మణరావు తెలిపారు. మిగిలిన రెండు ఎకరాలు కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో బంజరు భూమి కింద మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. ప్రయోజనం లేకపోయిందని వాపోయారు. చక్రాల కుర్చీలో తన భార్యతో కలిసి సోమవారం జడ్పీలో నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమానికి వచ్చి.. కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ‘నాలుగు యుద్ధాల్లో మేం పాల్గొన్నాం. దేశం కోసం ప్రాణాలర్పించేందుకు కూడా భయపడలేదు. కానీ నేడు మాకు జరుగుతున్న అన్యాయంపై పోరాడడానికి శక్తి సరిపోవడం లేదు. అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతో బాధాకరంగా ఉంది. దేశానికి సేవలందించినందుకు మాకు దక్కిన గౌరవం ఇదా?’ అని వాపోయారు. తమకు న్యాయం చేసి, ఆదుకోవాలని కలెక్టర్‌ను వేడుకున్నారు.

Updated Date - Jun 30 , 2026 | 12:21 AM