ఇలాగేనా చెత్తను తొలగించేది?
ABN , Publish Date - May 29 , 2026 | 11:44 PM
చెత్తను తొలగించేది ఇలా గేనా.. ఏ మాత్రం బాధ్యత లేదా అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎంహెచ్‌వోకు షోకాజ్ నోటీసు, సచివాలయ సెక్రటరీ సస్పెన్షన్‌కు ఆదేశం
స్వయంగా చెత్తను తీసి చూపించిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, మే 29 (ఆంధ్రజ్యోతి): చెత్తను తొలగించేది ఇలా గేనా.. ఏ మాత్రం బాధ్యత లేదా అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం ఆయన పలాస వెళుతూ మార్గమధ్యంలో నగరం లోని ఆరంగివీధి జంక్షన్ వద్ద కాలువ పక్కనే చెత్త ఉండ డాన్ని గమనించారు. వెంటనే కారు ఆపి దిగి హెల్తాఫీసర్ డా.సుధీర్‌ను పిలిపించారు. చెత్తను శుభ్రం చేసే విధానం ఇదేనా అని ప్రశ్నించారు. స్వయంగా చేతికి గ్లౌజులు వేసుకు ని చెత్తను తొలగించే విధానాన్ని వివరించడంతో పాటు చెత్తను తొలగించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఎంహెచ్‌వోకు వెంటనే షోకాజ్ జారీ చేశారు. విషయం తెలుసుకున్న కమిషనర్ హెచ్.కూర్మారావు, సచివాలయ కార్యదర్శి కావ్య, శానిటరీ ఇన్‌స్పెక్టర్ హుటాహుటిన అక్కడికి చేరుకు న్నారు. ప్రతీరోజూ శుభ్రంచేస్తున్నామని కావ్య కలెక్టర్ కు వివ రించడంతో ఆయన ఆగ్రహానికి గురయ్యారు. అలా అయితే ఇది ఏమిటని స్వయంగా తన చేత్తో చెత్తను తీసి చూపించారు. వెంటనే సచివాలయ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని కార్పొరేషన్ కమిషనర్ కూర్మారావుకు ఆదేశించారు.