అతిథులకు ఆశ్రయమేదీ?
ABN , Publish Date - Feb 22 , 2026 | 11:48 PM
నియో జకవర్గ కేంద్రం పాతపట్నంలో ఉన్న జిల్లా పరిషత్ అతిథిగృహం నిర్వహణ లేక నిరుపయోగంగా మిగిలిపోయింది.
నిరుపయోగంగా జడ్పీ అతిథి గృహం
విద్యుత్ సరఫరా నిలిపివేత
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా..
పట్టించుకోని పాలకులు, అధికారులు
పాతపట్నం, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): నియో జకవర్గ కేంద్రం పాతపట్నంలో ఉన్న జిల్లా పరిషత్ అతిథిగృహం నిర్వహణ లేక నిరుపయోగంగా మిగిలిపోయింది. దీంతో దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు విశ్రాంతి తీసుకోవడాని సరైన వసతి లేకపోవడంతో ఇబ్బం దిపడుతున్నారు. పాతపట్నంలో 1982-83 ప్రాంతంలో స్థానిక జాతీయరహదారికి ఆనుకొని పం చాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగ కార్యాలయ ఆవరణలో జిల్లా పరిషత్ అతిథిగృహాన్ని నిర్మిం చారు. అతిథులకు అందుబాటులో ఉండేందుకు వీలుగా దీనికి ఆనుకుని నైట్‌వాచ్‌మన్ నివాసం ఉండేందుకు చిన్నపాటి గదిని నిర్మించారు. దివం గత కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు మొదలు కొని రాష్ట్ర మంత్రులుగా సేవలందించిన కళావెంకట రావు, గౌతు శివాజీ, శుత్రు చర్ల విజయరామరాజు, అప్ప టి ఎమ్మెల్యే కలమట మోహన రావుతోపాటు ఉన్నతాధికారులు నియోజకవర్గ కేంద్రానికి వచ్చేటప్పు డు ఈ అతిథి గృహంలోనే విశ్రాంతి తీసు కొనేరువారు. ఈ క్రమంలో అధికారులతోపాటు, పార్టీ కార్యకర్తలతో సమీక్షలు సమావేశాలు నిర్వ హించేవారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ అతిథి గృహం కాలగమనంలో నిర్లక్ష్యానికి గురవుతూ వచ్చింది. మాజీ మంత్రి శతృచర్ల విజయరామ రాజు హయాంలో దీని అభివృద్ధికి నిధులు మం జూరు చేయడంతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఆ తర్వాత నైట్‌వాచ్‌మన్‌ను నియమించకపోవడం తోపాటు నిర్వహణను పట్టించుకోకపోవడంతో అ తిథి గృహం కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే నైట్ వాచ్‌మన్ నివాస గృహం శిఽథిల మైపోయింది. విద్యుత్ చార్జీలు కూడా చెల్లించకపో వడంతో కొన్నాళ్లగా సరఫరా నిలిపివేశారు. రాత్ర యితే చాలు అంధకారంగా మారిపోతుంది. దీంతో అసాంఘిక కార్యకలాపాలకు అండగా మారి పోయింది. జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఈ అతిథి గృహం నిరుపయోగంగా మిగిలిపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి దీనిని విని యోగంలోకి తీసుకురావాలని ఈప్రాంతవాసులు కోరుతున్నారు. దీనిపై పంచాయతీరాజ్ శాఖ డీఈ ఎ.చంద్రునాయుడు మాట్లాడుతూ.. ఇక్కడి ప రిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి పెట్టామన్నారు. దీనిని వినియోగంలోకి తెచ్చేందుకు కృషి చే స్తామని తెలిపారు.