Share News

సాగునీటి పనులు వేగవంతం చేయాలి

ABN , Publish Date - Mar 06 , 2026 | 11:40 PM

మండలంలో జరుగుతున్న సాగునీటి పనులను శుక్రవా రం కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కకర్‌ శుక్రవా రం పరిశీలించారు.

సాగునీటి పనులు వేగవంతం చేయాలి
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

  • కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

మెళియాపుట్టి, మార్చి 6(ఆంధ్రజ్యోతి): మండలంలో జరుగుతున్న సాగునీటి పనులను శుక్రవా రం కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కకర్‌ శుక్రవారం పరిశీలించారు. కొసమాల వద్ద మహేంద్ర తనయ నదిపై ఎత్తిపోతల పథకం నిర్మాణం చేప ట్టనున్న స్థలంతో పాటు ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ ప నులను కలెక్టర్‌ పరిశీలించారు. అలాగే చాపర వ ద్ద జరుగుతున్న ఆఫ్‌షోర్‌ జిరో లెవెల్‌ వద్ద జరుగు తున్న ఆనకట్టు పనులు, అచ్చానాపురం వద్ద జరు గుతున్న కాలువ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు అ ధిక ప్రాధాన్యం ఇస్తుంద ని, అందువల్ల పనుల్లో వే గవంతం పెంచాలని అ న్నారు. మెట్ట భూములకు సాగునీరు అందించేందు కు చర్యలు తీసుకుంటు న్నట్టు తెలిపారు. ఎత్తి పోతల పథకం పనులు త్వరితగతిన చేపట్టి సాగు నీరు అందించాలని ఆ గ్రామ రైతులు కోరుతూ వినతి పత్రం అందజేశా రు. తహసీల్దార్‌ బి.పాపరావు, ఇంజనీరింగ్‌ అధికా రులు, కూటమి నేతలు తదితరులు ఉన్నారు.

Updated Date - Mar 06 , 2026 | 11:40 PM