పనులు పూర్తయిన వెంటనే సాగునీరు
ABN , Publish Date - Feb 28 , 2026 | 12:31 AM
బొర్రంపేట గ్రా మ సమీపంలోని కడగంటి రిజర్వా యర్‌కు సంబం ధించిన మిగిలిన పనులు పూర్తయి న వెంటనే పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామని టెక్క లి ఆర్డీవో కృష్ణమూర్తి తెలిపారు.
కడగంటి రిజర్వాయర్‌ను పరిశీలించిన ఆర్డీవో కృష్ణమూర్తి
ఎల్‌ఎన్ పేట, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): బొర్రంపేట గ్రా మ సమీపంలోని కడగంటి రిజర్వా యర్‌కు సంబం ధించిన మిగిలిన పనులు పూర్తయి న వెంటనే పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామని టెక్క లి ఆర్డీవో కృష్ణమూర్తి తెలిపారు. కడగండి రిజర్వాయర్‌కు సంబంధించి మిగిలి న పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. రిజర్వాయర్ నిర్మాణంలో భూ ములు కోల్పోయిన బొర్రంపేట గ్రామానికి సంబంధించిన రైతులు కె.కృష్ణమా చారి, ఎం.అన్నాజీరావు, ఎం.నీలంనాయుడు, కె.భాస్కరరావుతోపాటు మరికొంత మంది రైతులకు ఇంతవరకు నష్టపరిహారం అందలేదని, శివారు పొలాలకు సా గునీరు అందడం లేదని ఆర్డీవో దృష్టికి తీసుకువచ్చారు. నిధులకు ప్రతిపాధిం చామని, మంజూరైన వెంటనే పనులు పూర్తి చేయించి పూర్తిస్థాయిలో సాగు నీరు అందేలా చూస్తానని ఆర్డీవో హామీ ఇచ్చారు. అనంతరం యంబరాం గ్రా మంలో జరుగుతున్న భూ రీసర్వేను పరిశీలించారు. మోదుగవలస ఆర్‌ఆర్ కా లనీ అంగన్‌వాడీ భవన నిర్మాణానికి మంజూరైన స్థలంలో వేరొక కుటుంబం ఇంటి నిర్మాణం చేపడుతున్నట్టు వచ్చిన ఫిర్యాదుపై పరిశీలించారు. అదే గ్రా మంలోని పాఠశాలను పరిశీలించారు. అలాగే తహసీల్దార్ కార్యాలయంలో ప్ర జల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. పీఏసీఎస్ చైర్మన్ కె.మన్మఽథరా వు, డీటీ నీలిమ, సీనియర్ అసిస్టెంట్ గవరయ్య, ఆర్‌ఐ శ్రీనివాసరావు, నీటి పారుదలశాఖ సిబ్బంది, పాల్గొన్నారు.