Share News

సాగునీటి స్వప్నం సాకారం

ABN , Publish Date - Jul 24 , 2026 | 12:31 AM

Cabinet gives green signal for Neradi Barrage దశాబ్దాలుగా వేధిస్తున్న వంశధార నీటి వివాదానికి స్వస్తి పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జిల్లా సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు అత్యంత కీలకమైన ‘నేరడి బ్యారేజీ’ నిర్మాణానికి ఏకంగా రూ. 641 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

సాగునీటి స్వప్నం సాకారం
టెక్కలిలో బాణాసంచా కాల్చి సందడి చేస్తున్న టీడీపీ శ్రేణులు

  • నేరడి బ్యారేజీకి రూ.641 కోట్లతో కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌

  • ఏడాదిలో 106 ఎకరాల భూసేకరణ.. రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి

  • శ్రీకాకుళం/ టెక్కలి, జూలై 23(ఆంధ్రజ్యోతి): దశాబ్దాలుగా వేధిస్తున్న వంశధార నీటి వివాదానికి స్వస్తి పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జిల్లా సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు అత్యంత కీలకమైన ‘నేరడి బ్యారేజీ’ నిర్మాణానికి ఏకంగా రూ. 641 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి గురువారం సమావేశమైంది. ఈ సమావేశంలో జిల్లాకు సంబంధించి కీలకమైన నేరడి బ్యారేజీ నిర్మాణానికి మోక్షం కలిగింది. దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన నేరడి ప్రాజెక్టును పట్టాలెక్కించి, కేంద్రం నుంచి గెజిట్‌ సాధించడంలోనూ, నిధులు మంజూరు చేయించడంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవ ఫలించింది. రూ.641 కోట్లను ప్రభుత్వం మంజూరు చేయడంతో కార్యాచరణ వేగవంతమైంది. కేంద్రం నోటిఫికేషన్‌ ప్రకారం.. బ్యారేజీ నిర్మాణం కోసం ఒడిశా భూభాగంలో 106 ఎకరాల భూమిని ఆ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏడాదిలోగా సేకరించి ఇవ్వనున్నారు. రెండేళ్ల వ్యవధిలోనే నేరడి బ్యారేజీ నిర్మాణాన్ని పూర్తి చేసి, వెనుకబడిన కరువు పీడిత ప్రాంతాల ఐతులకు నీళ్లందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. చట్టపరమైన చిక్కులను అధిగమించి, నిధులు రాబట్టి, నిర్ణీత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు తీసుకుంటున్న చర్యలపై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • టెక్కలిలో సంబరాలు

  • నేరడి బ్యారేజీ నిర్మాణానికి రూ.641కోట్లు మంజూరు చేయడంపై టెక్కలిలో టీడీపీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. గురువారం బాణాసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచిపెడుతూ సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. కార్యక్రమంలో నందిగాం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పినకాన జోగారావు, పీఏసీఎస్‌ అధ్యక్షుడు పోలాకి చంద్రశేఖర్‌, హనుమంతు రామకృష్ణ, మెండ దమయంతి, మామిడి రాము, పోలాకి షణ్ముఖరావు, దల్లి ప్రసాద్‌రెడ్డి, దోని బుజ్జి, ప్రపుల్లా, కిరణ్‌, ప్రీతీష్‌, శంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2026 | 12:31 AM