కొవ్వాడ అణుపార్క్‌తో తీరని నష్టం
ABN , Publish Date - Sep 05 , 2026 | 11:51 PM
కొవ్వాడలో ప్రతిపాదిత అణుపార్క్ వల్ల తీరని నష్టం వాటిల్లనున్నందున రద్దు చేయాలని ఆంధ్ర మేధావుల ఫోరం వ్యవ స్థాపక అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ డి మాండ్ చేశారు.
ఆంధ్ర మేధావుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు చలసాని
శ్రీకాకుళం అర్బన్, సెప్టెంబరు 5 (ఆంధ్ర జ్యోతి): కొవ్వాడలో ప్రతిపాదిత అణుపార్క్ వల్ల తీరని నష్టం వాటిల్లనున్నందున రద్దు చేయాలని ఆంధ్ర మేధావుల ఫోరం వ్యవ స్థాపక అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ డి మాండ్ చేశారు. ఫోరం అధ్యక్షుడు ప్రొఫెసర్ జి.అప్పల నాయుడు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చాపర సుందర్‌లాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నా జీరావుతో కలిసి శనివారం ఎన్‌జీవో హోంలో విలేకరులతో మాట్లాడుతూ.. అణుపార్క్ వల్ల ప్రజల భద్రత, పర్యావరణం, వ్యవసాయ భూ ములకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంద న్నారు. కొవ్వాడ, కోటపాలెం, రామచంద్రాపురం తదితర ప్రాంతాల్లో నిర్వాసి తుల సమస్యలను పరిష్కరించా లన్నారు. జిల్లా లో ప్రతిపాదిత కార్గో ఎయిర్ పోర్టు ను రద్దు చేయాలని, మత్స్య కారుల ఉపాధి కోసం జెట్టీలు, ఫిషింగ్ హార్బర్లు నిర్మించా లన్నారు. సమావే శంలో ఈసీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, మత్స్యకార సంఘం నాయ కులు చింతపల్లి సూర్య నారాయణ, కొమర మున్నా, కొవ్వాడ గ్రామస్తులు, కాం గ్రెస్ నాయ కులు తదితరులు పాల్గొన్నారు.