లడ్డూ కల్తీలో రూ.250కోట్ల అక్రమాలు
ABN , Publish Date - Jan 30 , 2026 | 12:08 AM
గత వైసీసీ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూ కల్తీ ఘటనలో రూ.250 కోట్లు అక్రమాలు జరిగినట్టు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆరోపించారు.
ఎమ్మెల్యే మామిడి గోవిందరావు
పాతపట్నం, జనవరి 29(ఆంధ్రజ్యోతి): గత వైసీసీ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూ కల్తీ ఘటనలో రూ.250 కోట్లు అక్రమాలు జరిగినట్టు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆరోపించారు. తిరుమల లడ్డూ కల్తీ ఘటనపై నిరసన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉత్కళాంధ్రుల ఆరాధ్యదైవం నీలమణిదుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణం నుంచి కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం వరకూ ర్యాలీ నిర్వహించి, ప్రత్యేక పూజలు చేపట్టారు. కార్యక్రమంలో ఏఎంసీ, పీఏసీఎస్ చైర్మన్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో 50శాతం రాయితీపై పశువుల దాణా పంపిణీ పంపిణీ చేశారు. కార్యక్రమంలో పశువైద్యులు పి.అనిల్, సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.