Share News

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పనుల్లో అక్రమాలు

ABN , Publish Date - Mar 31 , 2026 | 11:41 PM

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో చేపట్టిన పనుల్లో జరిగిన అక్రమాలకు సంబంధించి అప్పటి డిప్యూటీ ఎగ్జి క్యూటివ్‌ ఇంజనీర్‌ (డీఈఈ) ఎస్‌.చిరంజీవులు (ప్రస్తుతం రిటైర్డ్‌)పై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది.

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పనుల్లో అక్రమాలు

శ్రీకాకుళం, మార్చి 31(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో చేపట్టిన పనుల్లో జరిగిన అక్రమాలకు సంబంధించి అప్పటి డిప్యూటీ ఎగ్జి క్యూటివ్‌ ఇంజనీర్‌ (డీఈఈ) ఎస్‌.చిరంజీవులు (ప్రస్తుతం రిటైర్డ్‌)పై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. ఆయనకు మంజూరయ్యే పెన్షన్‌లో ఏడా ది పాటు 3 శాతం కోత విధిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంగ ళవారం జీవో జారీ చేసింది. పలాస-కాశీబుగ్గ పట్టణాల్లో చేపట్టిన పనుల్లో అవతకవకలు జరిగాయన్న ఆరోపణలపై విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభా గం విచారణ చేపట్టింది. ఈ మేరకు అప్పటి డీఈఈ ఎస్‌.చిరం జీవులుతో పాటు పబ్లిక్‌ హెల్త్‌కి మరో ఇద్దరిపై శాఖాపరమైన చర్యలకు జీఏ డైరెక్టర్‌ జనరల్‌ ప్రభుత్వానికి సిఫారసు చేశారు. దీని ఆధారంగా ప్రభుత్వం విచా రణ చేపట్టి, ఆ అధికారికి చార్జి మెమోలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై లోతైన విచారణ కోసం జీవీఎంసీ ఎస్‌ఈ కేవీఎన్‌ రవిని ప్రభుత్వం విచా రణాధికారిగా నియమించింది. అయితే చిరంజీవులలుపై మోపిన అభియో గాలు రుజువు కాలేదని సదరు విచారణాధికారి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. కాని ఈ నివేదికతో ప్రభుత్వం ఏకీభవించ లేదు. లోపాలు జరిగా యని గుర్తించిన ఉన్నతాధికారులు చిరంజీవులుకు షోకాజ్‌ నోటీసులిచ్చారు. తాను ఎదుర్కొంటున్న అభియోగాలు, ప్రభుత్వం ప్రతిపాదించిన శిక్ష (ఏడా ది పాటు 3 శాతం పెన్షన్‌ కోత)కు చిరంజీవులు అంగీకారం తెలు పుతూ రాతపూర్వకంగా వివరణ ఇచ్చారు. పెన్షన్‌ బెనిఫిట్స్‌ పెండింగ్‌లో ఉన్నం దున, వాటిని త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో సదరు విశ్రాంత అధికారి పెన్షన్‌లో ఏడాది పాటు 3 శాతం నిలిపివేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎస్‌.సురేష్‌ కుమార్‌ తుది ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Mar 31 , 2026 | 11:41 PM