Share News

‘దళిత సాహిత్య లోటు ‘ఈర్నం’తో భర్తీ

ABN , Publish Date - Jun 22 , 2026 | 12:00 AM

కళింగాంధ్ర సాహిత్యంలో దళిత సాహిత్య లోటును ‘ఈర్నం’ భర్తీ చేస్తుందని పలువురు రచయితలు అభిప్రాయపడ్డారు.

‘దళిత సాహిత్య లోటు ‘ఈర్నం’తో భర్తీ
‘ఈర్నం’ కవితా సంపుటి ఆవిష్కరణలో మాట్లాడుతున్న గుంటూరు లక్షీ నరసయ్య

శ్రీకాకుళం కల్చరల్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): కళింగాంధ్ర సాహిత్యంలో దళిత సాహిత్య లోటును ‘ఈర్నం’ భర్తీ చేస్తుందని పలువురు రచయితలు అభిప్రాయపడ్డారు. సాహితీ స్రవంతి, శ్రీకాకుళం సాహితి, చిగురుపల్లి చంద్రకళ స్మారక వేదిక ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఓ ప్రైవేటు రెసిడె న్సీలో కలమట దాసు బాబు రచించిన ‘ఈర్నం’ కవితా సంకలనాన్ని ప్రముఖ రచయిత గంటేడ గౌరునాయుడు ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా ప్రముఖ రచయిత, విమర్శకుడు గుంటూరు లక్ష్మీ నరసయ్య మా ట్లాడుతూ.. నేటి కళింగాంధ్ర దళిత వాస్తవ పరిస్థితులు ఈ సంకల నంలో కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నా యన్నారు. పడికట్టు పదాలను పక్కన పెట్టి దళితులు మాట్లాడుకునే భాష, వారి యాస, నుడికారంతో కనిపిస్తూ కవిత్వం జీవంతో ఉట్టి పడుతోందన్నారు.దళితుల ఆకాంక్షలు, వారి ఆశ యాలు, వారు పడుతున్న బాధలు, పోరాటాలు ఈ ‘ఈర్నం’లో ప్రతిబిం బిస్తున్నాయన్నారు. ‘ఈర్నం’ అనేది ఓ వాయిద్య పరికరమని పేర్కొం టూ ఈ వాద్య కళాకారుడు కొవ్వూరు జనార్దనరావును దుశ్శాలువతో సత్కరిం చారు. కార్యక్రమంలో రచయిత అట్టాడ అప్పలనాయుడు, చిగురుపల్లి చంద్రకళ స్మారక వేదిక చైర్మన్‌ చిగురుపల్లి ప్రభాకరరావు, సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి చీకటి దివాకర్‌, ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తిరుమల రావు, ఐద్వా జిల్లా కన్వీనర్‌ అల్లాడ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 22 , 2026 | 12:00 AM