Share News

ఎస్సీ వెల్ఫేర్‌ అధికారి అవినీతి కేసులపై విచారణ

ABN , Publish Date - Jul 10 , 2026 | 11:48 PM

ప్రస్తుతం జిల్లా ఎస్సీ వెల్ఫేర్‌, ఎంపవర్‌మెంట్‌ ఆఫీసర్‌గా (డిప్యూటీ డైరెక్టర్‌) పనిచేస్తున్న దాసరి మధుసూదనరావుపై ఉన్న అవినీతి, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణను ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ (విజిలెన్స్‌ శాఖ శుక్రవారం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది.

ఎస్సీ వెల్ఫేర్‌ అధికారి అవినీతి కేసులపై విచారణ

శ్రీకాకుళం, జూలై 10(ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం జిల్లా ఎస్సీ వెల్ఫేర్‌, ఎంపవర్‌మెంట్‌ ఆఫీసర్‌గా (డిప్యూటీ డైరెక్టర్‌) పనిచేస్తున్న దాసరి మధుసూదనరావుపై ఉన్న అవినీతి, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణను ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ (విజిలెన్స్‌ శాఖ శుక్రవారం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. మధుసూదనరావు గతంలో నెల్లూరు జిల్లాలో సోషల్‌ వెల్ఫేర్‌ డీడీగా పనిచేసిన సమయంలో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోప ణలపై ఏసీబీ కేసు నమోదైంది. ఈ కేసులో గతంలో విచారణ అధికారిగా ఉన్న ఏపీ సోషల్‌ వెల్ఫేర్‌ జేడీ జె.రంగలక్ష్మి దేవి 2026 మే 31న రిటైర్డ్‌ అయ్యారు. దీంతో ఆమె స్థానంలో ఏపీ సోషల్‌ వెల్ఫేర్‌ అడిష నల్‌ డైరెక్టర్‌ కె.సునీల్‌ రాజ్‌కుమార్‌ను కొత్త విచారణ అధికారిగా నియ మిస్తూ ప్రభుత్వం జీవో 142 విడుదల చేసింది. ఈ కేసులో విచారణ అధి కారి ముందు వాదనలు, ఆధారాలు ప్రవేశపెట్టేందుకు నెల్లూరు ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ వెంకటేశ్వర్లును ‘ప్రెజెంటింగ్‌ ఆఫీసర్‌’ గా నియ మిస్తూ జీవో 143 జారీ చేసింది. విచారణాధికారికి అవసరమైన డాక్యు మెంట్లను ఇవ్వడం, వాస్తవాలను సమర్ధ వంతంగా ప్రవేశపెట్టడం ప్రెజెం టింగ్‌ ఆఫీసర్‌ బాధ్యత అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిబంధనల ప్రకా రం నిర్ణీత కాలవ్యవధిలో విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమ ర్పించాలని విచారణ అధికారిని ప్రభుత్వం ఆదేశించింది.

Updated Date - Jul 10 , 2026 | 11:48 PM