రూ.14 కోట్లతో అంతర్జాతీయ క్రీడా కాంప్లెక్స్
ABN , Publish Date - May 23 , 2026 | 11:26 PM
శ్రీకాకుళం నగర పరిధి పాత్రునివలస సమీపంలో పెండింగ్ లో ఉన్న మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మా ణానికి కేంద్ర ప్రభుత్వం రూ.14 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. ఈ మేరకు శనివారం సదరు స్థలాన్ని పరిశీలిం చి భూమి పూజ చేశారు.
ఎమ్మెల్యే గొండు శంకర్
పాత శ్రీకాకుళం, మే 23(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగర పరిధి పాత్రునివలస సమీపంలో పెండింగ్ లో ఉన్న మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మా ణానికి కేంద్ర ప్రభుత్వం రూ.14 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. ఈ మేరకు శనివారం సదరు స్థలాన్ని పరిశీలిం చి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైనా ఈ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంట నే కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకెళ్లి నిధులు సాధించా మన్నారు. ఈ పనులను ఏడాది కాలంలోనే పూర్తి చేసి క్రీడాకారులకు అందు బాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. దీనిని కేవలం స్టేడియానికే పరిమితం చేయకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పూర్తి స్థాయి స్పోర్ట్స్ అకాడమీగా రూపుదిద్దే దిశలో చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కాంప్లెక్స్‌లో అధునాతన సింథటిక్ కోర్టులు, రెండు స్కాష్ కోర్టులు, బ్యాడ్మింటన్, కబడ్డీ మైదానాలతో పా టు హాకీ స్టేడియాన్ని నిర్మిస్తామన్నారు. క్రీడాకా రుల వసతి కోసం డార్మెటరీలు, డైనింగ్ హాల్స్ ఏర్పాటు చేసి శాప్ ఆధ్వర్యంలో నిపుణులైన కోచ్‌లతో శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. వీటితో పాటు కోడి రామ్మూర్తి స్టేడియం పనులను త్వరలోనే పూర్తి చేస్తామని, ఇదే ప్రాంగణంలో ఒలింపిక్ పతక విజేత కరణం మల్లీశ్వరి పేరు తో అకాడమీ స్థాపించడంతో పాటు సమీపంలో అంతర్జా తీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.