Share News

సంస్కృతంపై ఆసక్తి అభినందనీయం: శంకర్‌

ABN , Publish Date - Aug 26 , 2026 | 12:11 AM

భారతీయ సంప్రదాయ భాష సంస్కృతంపై విద్యార్థులు చూపెడుతున్న ఆసక్తి అభి నందనీయమని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

సంస్కృతంపై ఆసక్తి అభినందనీయం: శంకర్‌
విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందిస్తున్న ఎమ్మెల్యే శంకర్‌

శ్రీకాకుళం అర్బన్‌/కల్చరల్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): భారతీయ సంప్రదాయ భాష సంస్కృతంపై విద్యార్థులు చూపెడుతున్న ఆసక్తి అభి నందనీయమని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ తెలుగు, సంస్కృత అకాడమీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక బాపూజీ కళామం దిరంలో సంస్కృత సప్తాహ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంస్కృతం, తెలుగు భాషల ఔన్నత్యాన్ని భావిత రాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రముఖ సంస్కృత పండితులు ఎస్‌.జితేంద్రశర్మ, జి.శ్రీని వాసరావులను సత్కరించారు. కార్యక్రమంలో బరాటం లక్ష్మణరావు, పిలకా శాంతమ్మ, అట్టాడ బాబ్జి, పీటీజీవీ రంగాచార్యులు, భాస్కరభట్ల శ్రీరామశర్మ పాల్గొన్నారు.

Updated Date - Aug 26 , 2026 | 12:11 AM