Share News

బారువలో ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు హాల్ట్‌

ABN , Publish Date - Jan 19 , 2026 | 12:07 AM

సోంపేట తదితర ప్రాంతాల ప్రజల దశాబ్దాల కల ఆదివారం నిజమైంది.

బారువలో ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు హాల్ట్‌

సోంపేట రూరల్‌, జనవరి 18(ఆంధ్రజ్యోతి): సోంపేట తదితర ప్రాంతాల ప్రజల దశాబ్దాల కల ఆదివారం నిజమైంది. భువనేశ్వర్‌-విశాఖపట్నం ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆదివారం బారువ రైల్వే స్టేషన్‌లో ఆగింది. రైలు స్టేషన్‌కు గంటన్నర ఆలస్యంగా చేరుకున్నా 23 గ్రామాల నుంచి ప్రజలు తరలి వచ్చారు. సంక్రాంతి పండు గకు సొంత గ్రామాలకు వచ్చిన విద్యార్థులు, ఉద్యోగులు టిక్కెట్లు తీసుకుని రైలెక్కి మురిసిపోయారు. ఈ రైలును ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ జెండా ఊపి ప్రారంభించారు. ప్రయాణికులకు మిఠాయిలు పంచి ఆనందాన్ని పంచుకున్నారు. కార్యక్ర మంలో జనసేన నాయకుడు దాసరి రాజు, శ్రీనివాస రౌళో, చిత్రాడ శ్రీనివాసరావు, మద్దిల విజయలక్ష్మి, శ్యామ్‌, బ్రహ్మానందం, మోహనరావు, మడ్డు కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

వీక్లీ రైళ్ల హాల్ట్‌పై హర్షాతిరేకాలు

ఇచ్ఛాపురం/కంచిలి, జనవరి 18(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌లో మూడు వీక్లీ ట్రైన్లతో పాటు పూరీ- అహ్మదాబాద్‌ రైలు హాల్ట్‌, కంచిలి రైల్వే స్టేషన్‌ (సోంపేట ఆర్‌ఎస్‌)లో అమృత్‌భారత్‌ రైలు నిలుపు దల చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నా యి. ఇచ్ఛాపురంలో ఆదివారం రాధికాపూర్‌-ఎస్‌ఎంవీటీ బెంగుళూర్‌ ఎక్స్‌ప్రెస్‌, రంగాపాణి-నాగర్‌కోయిల్‌, న్యూజల్‌పాయిగురి-తిరుచినాపల్లి స్పెషల్‌ అమృత్‌ భారత్‌, కంచిలిలో అమృత్‌భారత్‌ రైళ్లను నిలపడంతో జడ్‌ఆర్‌యూసీసీ సభ్యుడు శ్రీనివా స రౌళో, డీఆర్‌యూ సీసీ సభ్యుడు కట్టా సూర్యప్రకాష్‌ లోకో పైలెట్‌కు, ప్రయాణికులకు స్వీట్లు అందించి ఆనందం వ్యక్తంచేశారు. రైళ్ల నిలుపుదలకు కృషి చేసిన కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం లో స్టేషన్‌ కన్సలేటివ్‌ మెంబర్లు ఉప్పాడ శంకర్‌రావు, తిరుమలరావు, లక్ష్మణ రావు, దొరబాబురెడ్డి, రెడ్డిక కార్పోరేషన్‌ చైర్మన్‌ కొండా శంకర్‌రెడ్డి, జగదీష్‌ పట్నాయక్‌, బంగారు కురయ్య, లోళ్ల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 19 , 2026 | 12:07 AM