Share News

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

ABN , Publish Date - Feb 22 , 2026 | 11:39 PM

జిల్లాలో ఇంటర్‌ మొదటి సంవత్సర పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వీటి కోసం 71 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు
నరసన్నపేటలో ఒక పరీక్ష కేంద్రం వద్ద హాల్‌ టిక్కెట్‌ నెంబర్లు వేస్తున్న ఇంటర్‌ బోర్డు అధికారులు

నరసన్నపేట, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇంటర్‌ మొదటి సంవత్సర పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వీటి కోసం 71 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి చెందిన 39,838 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. తొలిరోజు ప్రథమ సంవత్సరానికి చెందిన 19,850 మంది హాజరుకానున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు ఉదయం 8గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. అన్ని కేంద్రాల్లో బెంచీలను ఏర్పాటు చేశారు. తాగునీరు, వైద్యం తదితర సదుపాయాలు కల్పించారు. విద్యుత్‌కు అంతరాయం లేకుండా చూడాలని ప్రభుత్వం ఈపీడీసీఎల్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయనున్నారు. కేంద్రాలకు సమీపంలో ఎటువంటి జిరాక్సు షాపులు, ఇంటర్నెట్‌ కేంద్రాలు తెరవరాదని ప్రభుత్వం ఆదేశించింది. నరసన్నపేట, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, కళింగపట్నం, ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, పోలాకి, ప్రియాగ్రహారం, జలుమూరు, సారవకోట, పాతపట్నం, కింతలి, టెక్కలి, నందిగాం, నౌపడ, పూండి, రణస్థలం, కొయ్యాం, సింగుపురం, జి.సిగడాం, ఆమదాలవలస, బూర్జ, హిరమండలం, కొత్తూరు, మోళియపుట్టి, కంచిలి, సొంపేట, బారువ, తొగరాం, మందస, సరుబుజ్జిలి, కోటబొమ్మాళిలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొగరాం, కొయ్యాం, ప్రియాగ్రహారం, జి. సిగడాం తదితర పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - Feb 22 , 2026 | 11:39 PM