ఇంటింటికీ కుళాయిల ఏర్పాటు
ABN , Publish Date - Oct 05 , 2026 | 11:46 PM
నరసన్నపేట, టెక్కలి నియోజకవర్గాల ప్రజల తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ.1,204కోట్లు జలజీవన్ నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు.
పోలాకి, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): నరసన్నపేట, టెక్కలి నియోజకవర్గాల ప్రజల తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ.1,204కోట్లు జలజీవన్ నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. సోమవారం పోలాకి పంచాయతీకి రూ69.50 లక్షలతో నిర్మించనున్న జలజీవన్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనచేశారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగసభలో మాట్లాడుతూ జలజీవన్ నిధులతో ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఎం.వెంకట అప్పలనాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీసీసీబీ మాజీ చైర్మన్ డోల జగన్, కళింగకార్పొరేషన్ చైర్మన్ రోణంకి కృష్ణంనాయుడు, కూటమి నాయకులు బైరిభాస్కరరావు, ఎంవీ.నాయుడు, కిల్లివేణు, సూరపునారాయణదాస్, కరుకోల రమేష్ పాల్గొన్నారు.