Share News

సీఎస్‌ఆర్‌ నిధులతో విద్యుత్‌ దీపాల ఏర్పాటు

ABN , Publish Date - Mar 03 , 2026 | 11:56 PM

పోలాకి మండలంలోని తీర ప్రాంతంలో మత్స్యకారులు రాత్రి సమయంలో రాకపోకలు సాధించేందుకు వీలుగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రతిపాదన మేరకు కోల్‌ ఇండియా లిమిటెడ్‌ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటి (సీఎస్‌ఆర్‌) కార్యక్రమం కింద విద్యుత్‌ దీపాలను ఏర్పాటుచేయనున్నట్లు నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు.

సీఎస్‌ఆర్‌ నిధులతో విద్యుత్‌ దీపాల ఏర్పాటు
మాట్లాడుతున్న బగు ్గరమణమూర్తి

నరసన్నపేట/పోలాకి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): పోలాకి మండలంలోని తీర ప్రాంతంలో మత్స్యకారులు రాత్రి సమయంలో రాకపోకలు సాధించేందుకు వీలుగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రతిపాదన మేరకు కోల్‌ ఇండియా లిమిటెడ్‌ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటి (సీఎస్‌ఆర్‌) కార్యక్రమం కింద విద్యుత్‌ దీపాలను ఏర్పాటుచేయనున్నట్లు నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. మంగళవారం పోలాకి మండలంలోని కత్తెరవానిపేట క్యాంప్‌ కార్యాలయంలో విలేకరులతో మా ట్లాడుతూ విద్యుత్‌ దీపాల ఏర్పాటుకు పాలనపరమైన పక్రియ పూర్తయ్యిందని తెలిపారు. తీరగ్రామాల్లో విద్యుత్‌ వెలుగుల వల్ల రహదారి ప్రమాదాలు, దొంగతనాలు, దోపిడీలకు అడ్డుకట్టపడుతుందని చెప్పారు.

‘దండి మార్చ్‌ 2.0’కు ఆహ్వానం

డ్రగ్స్‌ తీసుకోవడం వల్ల కలిగే అనర్థాలపై ఈనెల 12న దండియాత్ర రోజున దండి మార్చ్‌ 2.0 పేరుతో నరసన్నపేటలో అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలాం సంస్థ ప్రతినిధి జయప్రకాశ్‌ తెలిపారు.ఈ మేరకు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తికి జయప్రకాశ్‌ మంగళవారం ఆహ్వానించారు. డ్రగ్స్‌ వద్దు అన్న నినాదంతో 100 మీటర్లు జాతీయజెండాతో పట్టణంలో ర్యాలీ, జూనియర్‌ కళాశాల మైదానంలో అవగాహన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.

\

Updated Date - Mar 03 , 2026 | 11:56 PM