యువనేత లోకేశ్ స్ఫూర్తితో..
ABN , Publish Date - Oct 08 , 2026 | 12:20 AM
కార్యకర్తలే దేవుళ్లు అన్న దివంగత ఎన్టీఆర్ నినాదాన్ని ముం దుకు తీసుకెళ్లడంతో పాటు తెలుగుదేశం పార్టీ ఏ ఒక్కరిదో కాదు.. మనందరిదీ అనే అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలను ఆచరణలో పెడుతూ పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
టీడీపీ కార్యకర్తలకు ఆత్మీయ సత్కారం
కాశీబుగ్గ, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): కార్యకర్తలే దేవుళ్లు అన్న దివంగత ఎన్టీఆర్ నినాదాన్ని ముం దుకు తీసుకెళ్లడంతో పాటు తెలుగుదేశం పార్టీ ఏ ఒక్కరిదో కాదు.. మనందరిదీ అనే అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలను ఆచరణలో పెడుతూ పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కార్యకర్తలే అధినే తలని ప్రకటించిన యువనేత నారా లోకేశ్ స్ఫూర్తి తో కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసు కెళ్లేందుకు విశేషంగా కృషి చేస్తున్న పార్టీ నాయకు లు, కార్యకర్తలకు ఆత్మీయ గౌరవ సత్కారం నిర్వహించారు. పలాస నియోజకవర్గంలో పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పసుపు సైనికులను విజయనగరం జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాం తమైన సన్‌రే రిసార్ట్‌లో బుధవారం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త వెంకన్న చౌదిరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ.. పార్టీ అధినేత చంద్రబాబు ఆలోచ నలు తనను ప్రభావితం చేయగా, యువనేత లోకేశ్ నినాదం స్ఫూర్తినిచ్చిందని అన్నారు. కార్యక ర్తల కష్టసుఖాల్లో ఎల్లప్పుడు తాను అండగా ఉం టానని స్పష్టం చేశారు. అనంతరం టీడీపీ నాయ కుల జానపద కళారూపాల ప్రదర్శన ఆకట్టుకుంది.